Jeevitha: రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం బయటపెట్టిన జీవిత

డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ వివాహం చేసుకున్న జంటలో ఎవర్ గ్రీన్ జంట రాజశేఖర్ జీవిత. వీరు ఏ ఫంక్షన్ లో అయినా సరే ఇద్దరిలో ఒకరు మాత్రం కనిపించరు.. ఎప్పుడూ ఇద్దరూ కలిసి కనిపిస్తారు. అలాగే వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించారు కూడా. నటీనటులైన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1991 జులై 10న చెన్నైలో వీరి వివాహం జరిగింది. 32 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

అయితే రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్న విషయాలను బయటపెట్టారు జీవిత.1987లో వచ్చిన తలంబ్రాలు సినిమాలో జీవిత, రాజశేఖర్ కలిసి నటించారు. ఆ సినిమా ద్వారానే వీరి ప్రేమకు బీజం పడింది. పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపే వారట. ఆ సమయంలో రాజశేఖర్ ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేశారట జీవిత. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారని.. ఆయనలో నచ్చే విషయం అదేనని చెప్పారు.

అంతే కాకుండా ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆకట్టుకునే వారని.. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారని తెలిపారు. అయితే ఓ రోజు తాను ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకొని మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అని రాజశేఖర్ చెప్పారట. ఆ తరువాత అన్ని సర్దుకున్నాయని తెలిపారు. మొత్తానికైతే మొదట రాజశేఖర్ కు జీవితనే ప్రపోజ్ చేసిందట. వీరి లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు