Dasara: నానిని కోలీవుడ్ తొక్కేసింది

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం దసరా జోరు ఓ రేంజ్ లో ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుంది. తొలి రోజునే రూ. 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి ఈ చిత్రం నేచురల్ స్టార్ కెరీర్ బెస్ట్ మూవీ గా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కనిపిస్తుంది. పాన్ ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోను దసరా సినిమా వసుళ్ళు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మార్చి 30న ఈ సినిమా ప్రీమియర్స్ తో కలిపి 90 లక్షల డాలర్స్ ను కలెక్ట్ చేసింది. ఇక శుక్రవారం నాటికి ఇది 1.2 మిలియన్ డాలర్స్ ను టచ్ చేసింది.

నాని సినిమాలకు ఓవర్సీస్ ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అది మరోసారి ప్రూవ్ అయింది. దసరాతో నాని మరోసారి మిలియన్ క్లబ్ మార్క్ ను క్రాస్ చేయటం విశేషం. అలాగే ఈ సినిమాతో మన వెర్సైటైల్ కథానాయకుడు ఓ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే, దసరా సినిమా నేపథ్యంలో, హీరో నానికి తమిళనాడు సినీ పరిశ్రమ అన్యాయం చేసింది.

దసరా సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కగా ఆ సినిమాకు కోలీవుడ్ తక్కువ థియేటర్లు ఇచ్చింది. అదే విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రిలీజ్ అయినప్పటికీ వారసుడు సినిమాకు 160 థియేటర్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు దసరా సినిమా కోసం కేవలం 80 థియేటర్లు మాత్రమే ఇచ్చి నాని సినిమాను తొక్కేసింది తమిళ్ ఇండస్ట్రీ.

- Advertisement -

దీంతో అప్పుడు వారసుడు సినిమాకు అన్యాయం జరుగుతుందని రోడ్డేక్కిన తమిళ దర్శకనిర్మాతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు అంటూ తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. మరి దీనికి కోలీవుడ్ నిర్మాతలు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు