Samantha: 14 ఏళ్ళ కుందనపు బొమ్మ

ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అనేది ఈ రోజుల్లో చిన్న విషయం కాదు. చాలామంది ఒకటి రెండు సినిమాలతో ఫేమ్ రాగానే, చాలా సినిమాలు సంతకాలు పెట్టి వాటి ఫెయిల్యూర్ రిజల్ట్స్ చూసి అప్పటికప్పుడే తమ కెరియర్ ను ముగించేసుకుంటున్నారు. కానీ ఈ తరుణంలో 14 ఏళ్లు సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ని పూర్తి చేసుకుంది సమంత.

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ కుందనపు బొమ్మ, ఎంతోమంది కుర్రకారు మనసును మాయ చేసింది. ఇప్పటికి ప్రతి ప్రేక్షకుడికి జెస్సి పాత్ర కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. 2010 లో స్టార్ట్ అయిన సమంత కెరియర్ నేటికీ 14 ఏళ్లు పూర్తిచేసుకుంది. తన కెరియర్ లో హిట్,ప్లాప్ లు ఎన్ని వచ్చిన కూడా ఆమె ఇమేజ్ మాత్రం ఇప్పటికే కాదు,ఎప్పటికి తగ్గదు,అనిపించుకుంది.

ఏ మాయ చేసావే తరువాత బృందావనం,దూకుడు,ఈగ లాంటి వరుస హిట్ సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీ లో స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఇకపోతే అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ,ఆ లాంటి సినిమాలు సమంత కెరియర్ లో గుర్తుండిపోయే హిట్ సినిమాలు.ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ్ లో కూడా తన ప్రతిభను చాటుకుని మంచి హిట్ సినిమాలు చేసింది.

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య తో “ఆటో నగర్ సూర్య” “మనం” లాంటి సినిమాలు చేయడమే కాకుండా రియల్ లైఫ్ లో తన ప్రేమను నిలబెట్టుకుని అక్కినేని కుటుంబానికి కోడలిగా మారింది. కొన్ని అనివార్య కారణాల వలన వారిద్దరూ విడిపోవలసి వచ్చింది.

కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ మంచి సూపర్ హిట్ లు అందుకుంది. అలానే సమంతకి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇకపోతే సమంత ప్రస్తుతం కొన్ని అనారోగ్య పరిస్థితులు వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు