14 Years For Ye Maaya Chesave

కొన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా ఎప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ను దక్కించుకుని ఉంటాయి. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే సినిమా అలాంటిదే అని చెప్పొచ్చు. ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఇదే సినిమాను తమిళ్లో కూడా విన్నయతాండ వరువాయ అని తెరకెక్కించాడు గౌతం. ఈ సినిమా అక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ను, తన మొదటి సినిమా ఫలితం నిరాశపరిచింది. ప్రేక్షకులను కూడా ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ వాస్తవానికి జోష్ సినిమా చాలా బాగుంటుంది. అప్పుడు ఉన్న కొన్ని రీజన్స్ వలన జోష్ సినిమా అప్పట్లో సరిగ్గా ఆడలేదు. ఆ సినిమా తర్వాత చేసిన ఏమాయ చేసావే సినిమా నాగ్ చైతన్యకి మంచి క్లాస్ హిట్ అయింది.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ బెస్ట్ వర్క్ లో ఈ సినిమాని పరిగణించవచ్చు. ఈ సినిమాలో కార్తీక్, జెస్సి క్యారెక్టర్ లను డిజైన్ చేసిన విధానం చాలామందిని ఆకర్షించుకుంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక స్టూడెంట్ తనకంటే ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితో ప్రేమలో పడటం. అలానే కార్తీక్ దర్శకుడు కావాలి అనుకోవటం. జెస్సీ కి సినిమాలు అంటే నచ్చకపోవడం. వీరిద్దరూ ప్రేమలో పడటం. వీటన్నిటిని అద్భుతంగా చూపిస్తూ, సినిమాను ఒక క్లాసిక్ గా మలిచాడు గౌతమ్ వాసుదేవ్.

- Advertisement -

ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికీ ఆ పాటలు విన్న కూడా అదే ఫీల్ క్యారీ అవుతుంది. జెస్సీ అండ్ కార్తీక్ క్యారెక్టర్లు ఎప్పటికీ ప్రేక్షకులు మనసుల్లో పదిలంగా ఉండిపోతాయి. నాగచైతన్య చేసిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఏ మాయ చేసావే. నేటికీ ఈ సినిమా 14 ఏళ్ళను పూర్తి చేసుకుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు