Lokesh kanagaraj: ఏకంగా రజినీకే ఎదురెలుతున్న ‘లారెన్స్’?

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఫుల్ బిజీ గా ఉన్నాడు. జైలర్ ఇచ్చిన బూస్ట్ తో వరుస సినిమాలు లైన్లో పెట్టాడు తలైవా. అల్రెడీ తన 170 వ సినిమా టీజె జ్ఞానవేల్ తో మొదలు పెట్టగా ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ తీయడం జరిగింది. ఇక ఈ షెడ్యూల్ లో చాలా ఏళ్ళ తరువాత రజిని, అమితాబ్ కలిసి నటించడం జరిగింది.

ఇక ఈ సినిమా చేస్తునే తన నెక్స్ట్ సినిమా కూడా షూట్ చేయాలనీ భావిస్తున్నారు. తలైవర్171 వ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

రజినీకాంత్ 171వ చిత్రంగా తెరక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్నాడని వార్త తమిళ్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.ఇక స్వతహాగానే రజిని అభిమాని అయిన లారెన్స్ రజినీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నానని పలుమార్లు చెప్పాడు.

- Advertisement -

ఇప్పుడు లోకేష్ కనగరాజ్ రజినీతో చేస్తున్న సినిమాలో ఒక పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ ఆఫర్ ఇచ్చాడని, రజినీతో సినిమా అనగానే విలన్ రోల్ అయినా సరేనని లారెన్స్ సరేనన్నాడని సమాచారం.

అయితే ఈ వార్తపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు గాని, లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోలు విలన్ గా నటించడం వెరీ కామన్. పైగా వాళ్ళు హీరోతో సమానంగా ఎలివేట్ అవడం తెలిసిందే. మరి లారెన్స్ విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలు నిజమైతే ‘లోకి’ రజినీకి అప్పొసిట్ గా లారెన్స్ ని ఎలా చూపిస్తాడన్న అంశం పై ఫ్యాన్స్ ఇప్పుడే లెక్కలేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు