Ott movies on this week : ఈ వారం ఓటిటి లో రాబోయే చిత్రాలివే !

లాక్ డౌన్ తరవాత ఓటిటి చిత్రాలకు ఆడియన్స్ చాలా కనెక్ట్ అయిపోయారని తెలిసిందే. థియేటర్ల వద్దకు ఎక్కువ రేట్లు పెట్టలేక కొందరు వెనక్కి తగ్గితే, మరికొందరు ఓపిక లేక తగ్గిపోయారు. ఈ క్రమంలో వీళ్ళకి ఒటిటి ప్లాట్ ఫామ్ బెస్ట్ ఆప్షన్స్ గా మారాయి. ఇప్పుడు థియేటర్ల దగ్గ బాగా సినిమాలు చూస్తున్నప్పటికీ ఓటిటి కి ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఇక ప్రతీవారం లాగానే ఈ వారం కూడా కొన్ని ప్రముఖ సినిమాలు ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఈ వారం మాత్రం చాలా తక్కువ సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలేవో ఒక్కసారి గమనిస్తే..

మలైకోట్టై వాలీబాన్ :
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను జల్లికట్టు ఫేమ్ “లిజో జోస్” డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమా థియేటర్ల వద్ద అంతగా ప్రభావం చూపలేదు. జాన్ మ్యారి క్రియేటివ్ బ్యానర్ పై శిబూ బేబీ జాన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ అందించాడు. ఇక ఈ వారం అనగా ఫిబ్రవరి 23 ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ‘హాట్ స్టార్’ లో విడుదల కానుంది. మరి థియేటర్లలో ప్రభావం చూపని ఈ సినిమా ఓటిటి లో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

పొచ్చర్ :
ఏనుగుల నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సిరీస్ లో అంతా కొత్త నటులే నటించడం జరిగింది.

- Advertisement -

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ :
షీనా బోరా సెన్సేషనల్ హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందగా, షీనా కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నిందితురాలిగా ఉండడం వల్ల ఈ డాక్యుమెంటరీ సిరీస్ పై ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 23న నెట్ ఫ్లిక్స్ లోనే ఈ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు