Yukti Thareja : రంగబలి బ్యూటి ఈ సినిమాతోనైనా క్లిక్ అవుతుందా?

టాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో ‘యుక్తి తరేజా’ ఒకరు. ఎంతో మంది హీరోయిన్ల లాగానే ఈమె కూడా ఈ గ్లామర్ ఫిల్డ్ లో రాణించాలని టాలీవుడ్ లోనే ఫస్ట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్య నటించిన ‘రంగబలి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సక్సెస్ మాత్రం కొట్టలేకపోయింది. అందుకే మరో అవకాశం కోసం కూడా ఏడాది పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. నిజానికి హిందీలో ఇమ్రాన్ హష్మీతో ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో ముందు నటించింది యుక్తి. ‘లుట్ గయే’ అనే పేరుతో రిలీజ్ అయిన ఆ పాట యూట్యూబ్ లో ఏకంగా 1.3tb వ్యూస్ కొట్టింది.

అయినా ఈ అమ్మాయికి ఎక్కడా ఛాన్సులు రాలేదు. చివరికి మళ్ళీ టాలీవుడ్ నుండే అవకాశం దక్కించుకుంది. SLV సినిమాస్ బ్యానర్ లో చెరుకూరి ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త సినిమా ‘కింగ్ జాకీ క్వీన్’ లో యుక్తి థేరేజా హీరోయిన్ గా నటిస్తుంది. కేకే అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దసరా లో హీరో ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది.

ఇక యుక్తి తరేజా రంగ బలిలో నటించి తన గ్లామర్ తో మెప్పించినా సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే సోషల్ మీడియాలో ఫాలోవర్లు మాత్రం పెరిగారు. పైగా అప్పుడప్పుడూ సౌత్ లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి చేసింది. మరి ఇప్పుడు నటించబోయే కింగ్ జాకీ క్వీన్ తో అయినా సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు