Ritika Singh : ఏ సినిమాలు లేనట్టు ఇలాంటివి చేస్తుందేంటి?

టాలీవుడ్ లో గురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన ఊరమాస్ పెర్ఫార్మన్స్ తో అందర్నీ ఆకర్షించిన భామ రితికా సింగ్. స్వతహాగా మార్షల్ ఆర్టిస్ట్ అయిన రితిక సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చింది. అలా సుధ కొంగర తీసిన “ఇరుధి సుట్రు” లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఒక బాక్సర్ గా నటించిన రితికా తన ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమానే తెలుగులో గురు పేరుతో రీమేక్ చేసారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత మాత్రం తెలుగులో మళ్ళీ చేయలేదు రితిక.

అప్పుడెప్పుడో ఆరేళ్ళ కిందట నీవెవరో అనే సినిమాలో నటించింది. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే కోలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ ఉంది. అయితే పదికి పైగా సినిమాలు చేసిన రితికా ఇప్పటివరకూ మూడు సినిమాలతోనే సక్సెస్ దక్కించుకుంది. దాదాపు నాలుగేళ్లుగా సరైన హిట్ లేక మంచి హిట్టు కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయితే స్క్రిప్ట్ సెలక్షన్ లోపం వల్ల మంచి సినిమాలు కూడా చేయలేకపోతోంది ఈ భామ. పేరుకి బాక్సింగ్ బ్యూటీయే అయినా రితికా కి సినిమాల స్క్రిప్ట్ సెలెక్షన్ల పట్ల అవగాహన పెద్దగా లేదు.

లాస్ట్ ఇయర్ హత్య అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించగా ఆ సినిమా పెద్దగా యూస్ కాలేదు. ఇక మలయాళం లో కింగ్ అఫ్ కోత లో ఐటెం సాంగ్ చేసి ఆడియన్స్ దృష్టి లో మరింత తక్కువైంది. తాజాగా తెలుగులో వళరి అనే చిన్న సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఒక హారర్ సినిమాగా తెరకెక్కింది. శ్రీరామ్, సుబ్బరాజు, ఉత్తేజ్ తదితరులు నటించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో మార్చ్ 6 నుండి టెలికాస్ట్ కానుంది.

- Advertisement -

అయితే ఏ సినిమాలు లేనట్లు రితికా సింగ్ ఇలాంటి నాసిరకం సినిమాలు ఎందుకు చేస్తుందంటూ ఆమె ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో టాలెంట్ ఉన్నా, గ్లామర్ ఉన్నా, సక్సెస్ లేకపోతే ఎవరైనా ఇలాంటి చిన్నా చితకా సినిమాలు, ఐటెం సాంగ్స్ చేయాల్సిందేనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే ఏ హీరోయిన్ కైనా అరడజను సినిమాలు వచ్చి పడతాయి, అంతవరకూ హీరోయిన్లు ఓపికగా ఉండాలి. కానీ అప్పటివరకూ సక్సెస్ రాకపోయినా మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేయడం మంచిదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు