Anasuya: అనసూయ ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టిన టాలీవుడ్ ప్రముఖ రైటర్..!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా భారీ క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ అనసూయ.. హాట్ యాంకర్ గా కూడా పేరు సంపాదించింది ఈ అమ్మడు. ఒకవైపు కుటుంబాన్ని మరొకవైపు కెరియర్ ని బ్యాలెన్స్ చేస్తూనే ముందుకు వెళ్తోంది అనసూయ. ఇదిలా ఉండగా..ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ అనసూయ గురించి చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం అనసూయ ఎక్కువగా సినిమాలలో నటిస్తోంది. వచ్చిన అవకాశాలు అన్నింటినీ ఉపయోగించుకుంటూ భారీగానే సంపాదిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూనే తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అనసూయ పడ్డ కష్టాలను వెల్లడించారు. అనసూయ ఏదైనా ఎపిసోడ్ షూట్ అయిపోగానే మరో ఎపిసోడ్ కి రాత్రి 7 గంటలకు వచ్చి ఒంటిగంట వరకు రిహార్సల్ చేస్తూ ఉండేది.. అలాంటి సమయంలో తన భర్త బయట కారులో వెయిట్ చేసే వారు అంటూ తెలిపారు ప్రసన్నకుమార్.

ఒక కొత్త షో కోసం మొత్తం అంతా ఫిక్స్ చేసుకున్నాము.. షూట్ కి రెండు రోజుల ముందు అనసూయ డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే రెస్ట్ తీసుకొని మూడవరోజు షూటింగ్ కి వచ్చింది అంటూ తెలియజేశారు ప్రసన్నకుమార్.. అలా ఒకవైపు షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ ప్రతి అర్ధగంటకు ఒకసారి వెళ్లి తన బేబీకి ఫీడింగ్ ఇస్తూ యాంకర్ గా చేసిందని అలా ఎవరు చేయలేరు అంటూ కూడా ప్రసన్నకుమార్ తెలియజేశారు.

- Advertisement -

అయితే అలాంటి ఇబ్బందులలో కూడా కష్టపడి చేసినటువంటి షూటింగ్ కోసం.. ఇప్పటివరకు ఆ డబ్బులు అడగలేదని ప్రసన్నకుమార్ తెలిపారు.. అలాంటి సమయంలో అనసూయ ఇంట్లో ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్ అని.. సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ చూసి ఎప్పుడు చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు.. కానీ అనసూయ ఒక టఫ్ అమ్మాయి అంటూ ఇండస్ట్రీలో అలాంటి అమ్మాయిని తాను చూడలేదంటూ ప్రసన్నకుమార్ వెల్లడించారు.

అనసూయని ఏ అబ్బాయి కూడా ఫ్లాట్ చేయలేరని.. ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా తెలిపారు.. తన జీవితంలో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ తనని ఇలా మార్చేశాయని ప్రసన్నకుమార్ తెలిపారు. అనసూయ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం వెనుక ఉన్న కష్టాలను తెలిపి ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు బెజవాడ ప్రసన్నకుమార్. ఇకపోతే అనసూయ పై ఎప్పుడూ ట్రోల్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాలని.. ఆ తర్వాత ఆమె గురించి మాట్లాడితే బాగుంటుంది అని కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు