HBD Teja: డైరెక్టర్ తేజ గురించి తెలియని నిజాలు ఇవే..!

డైరెక్టర్ తేజ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయిన డైరెక్టర్.. ఎలాంటి విషయాలైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేటువంటి డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు. కొత్త నటీనటులను పరిచయం చేయడానికి కూడా ఎంతోమంది ఈ డైరెక్టర్ ని సంప్రదిస్తూ ఉంటారు.. అయితే ఈ రోజు డైరెక్టర్ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైరెక్టర్ తేజ 1966 ఫిబ్రవరి 22న మద్రాసులో జన్మించారు.. చిన్న వయసులోనే తల్లితండ్రులను కోల్పోయారు తేజ. తర్వాత ఎన్నో కష్టాలను అనుభవిస్తూ.. ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో ఎదిగారు.. మొదట లైటింగ్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు.. ఆ తర్వాత కెమెరా డిపార్ట్మెంట్ లో కొద్ది రోజులు పని చేసిన తేజ.. హిందీ, తెలుగు ఇండస్ట్రీలలో కెమెరామెన్ గా కూడా పలు సినిమాలకు పనిచేశారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తేజ..వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాకు పోస్టర్ లోగోను కూడా తయారు చేసి ఇచ్చారట.

దీంతో వర్మ తేజ ఆర్ట్ కి ఇంప్రెస్స్ అయ్యి.. తర్వాత తన దర్శకత్వంలో వచ్చిన రాత్ అనే చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చారట.. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేశారు.. అలా కెమెరామెన్ గా సక్సెస్ సాధించిన డైరెక్టర్ తేజ మొదటి తెరకెక్కించిన సినిమా “చిత్రం”.. ఈ చిత్రాన్ని రామోజీరావు ప్రొడక్షన్లో కొత్త నటీనటులతో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు.

- Advertisement -

డైరెక్టర్ తేజ రెండవ సినిమా ఫ్యామిలీ సర్కస్.. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో యువత లో ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడమే కాదు నంది అవార్డులను కూడా అందుకున్నారు. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ,రీమాసేన్ లను పరిచయం చేశారు.. ఆ తర్వాత జయం సినిమాతో నితిన్ , సదాను హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా నిజం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మిగిలినప్పటికీ మహేష్ బాబుకు ఈ సినిమా నంది అవార్డును తీసుకువచ్చింది.. డైరెక్టర్ తేజ పరిచయం చేసినటువంటి హీరో హీరోయిన్లతో పాటు టెక్నీషియన్స్ కూడా అతి తక్కువ సమయంలో టాప్ పొజిషన్ లో ఉన్నారు.. తేజ పరిచయం చేసిన వారిలో ఉదయ్ కిరణ్, కాజల్ అగర్వాల్ ,నితిన్, నవదీప్ , సుమన్ శెట్టి, రీమాసేన్, సదా , మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ తదితర నటీనటులు కూడా ఉన్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు