Tanikella Bharani: నటుడు తనికెళ్ల భరణి జీవిత కష్టాలు తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే..!

తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ నటుడుగా గుర్తింపు పొందారు నటుడు తనికెళ్ల భరణి.. నటుడు గానే కాకుండా డైరెక్టర్ గా, రచయితగా ఎలాంటి పాత్రలో నైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటారు. అలా వెండితెరపై ఎన్నో పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న తనికెళ్ల భరణి ఈమధ్య పెద్దగా అవకాశాలను అందుకోలేక పోతున్నారు. అయితే ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం పంచుకున్నారు. ముఖ్యంగా తన సినీ కెరియర్ , వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాలను కూడా తెలియజేశారు.

తనికెళ్ల భరణికి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ.. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పేరుతో వచ్చిన అవార్డు అంటేనే తనకు చాలా ఇష్టం అంటూ తెలిపారు.. తన జీవితం అంత సాఫీగా సాగలేదని.. ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన అది తన స్నేహితుడు మరణం అని.. 50 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తనని ఇప్పటికీ బాధ పెడుతూనే ఉందంటూ తెలిపారు తనికెళ్ల భరణి.

నా మిత్రుడు దేవరకొండ నరసింహ కుమార్.. డిగ్రీ వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాము.. నాకు తనకంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది.. చాలా మంచివాడు తెలివైనవాడు కూడా.. కానీ అలాంటి వాడికి ప్రమాదం జరగడం.. వాడు మరణించడం ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించు కోలేకపోతున్నాను అంటూ తెలిపారు. నాలో రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందుగా గ్రహించింది నా స్నేహితుడే అంటూ వెల్లడించారు.. ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ .. నాతో అద్భుతమైన కవితలు రాయిస్తూ ఉండేవాడు..

- Advertisement -

ఒకవేళ నేను రాసిన తర్వాత బాగుందా లేదా ఎక్కడైనా మార్పులు చేయాలా కూడా నా స్నేహితుడి దగ్గరుండి ఎంకరేజ్ చేసేవారు అంటూ తనికెళ్ల భరణి తెలిపారు. ఆరోజు నా స్నేహితుడు నా వెంట ఉండి నడిపించడం వల్లే ఈరోజు ఈ పొజిషన్ కి రావడానికి కారణం అయ్యిందని తెలిపారు.. అలాంటి మిత్రుడిని కోల్పోయిన నాకు ఆ విషయం నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటూ ఎమోషనల్ అయ్యారు తనికెళ్ల భరణి.. ఇక కుటుంబ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ యూట్యూబ్ థంబ్ నెయిల్స్ వల్ల ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను అంటూ తెలియజేశారు. మొత్తానికి అయితే తనికెళ్ళ భరణి జీవితంలో జరిగిన ఈ విషాదం ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు