Chirajeevi: ఆ తప్పే అక్కడ చిరంజీవిని స్టార్ హీరో కాకుండా చేసిందా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే స్వయంకృషి అనే పేరుకి మారుపేరని చెప్పవచ్చు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తానే స్వయంగా ఇండస్ట్రీలో ఎదిగిన నటుడుగా పేరుపొందారు. చిరంజీవి తన హీరోయిజం తో పాటు నటనతో, డ్యాన్స్ లతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకున్నారు. ఇలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న చిరంజీవి పై కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో కమలహాసన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు అందరిలో ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి.

చిరంజీవి తలచుకుంటే కోలీవుడ్ లో ఎప్పుడో పెద్ద స్టార్ అయ్యేవారని కమలహాసన్ తెలియజేశారు. అయితే తాను సినిమాలు తీస్తున్న సమయంలో ఎక్కువగా కోలీవుడ్ ఇండస్ట్రీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని అందువల్లే ఆయన స్టార్ స్టేటస్ ని ఇక్కడ అందుకోలేకపోయారని కమలహాసన్ తెలియజేశారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలను ఇప్పుడు మెగా అభిమానుల మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కమలహాసన్ వంటి పెద్ద నటులే చిరంజీవి గురించి ఇంత గొప్పగా చెప్పడం అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.

మాతో పాటు చాలామంది హీరోలు అన్ని భాషలలో ఫోకస్ పెట్టినప్పటికీ చిరంజీవి మాత్రం కేవలం తెలుగు సినీ పరిశ్రమ పై ఎక్కువగా ఫోకస్ చేశారు.. అందుకే ఆయన తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా పేరు సంపాదించారని తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రానికి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.. యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం ఇది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్ లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న చిరంజీవిపై గతంలో ప్రముఖులు చేసిన కామెంట్లను మెగా అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఇంత గొప్ప నటుడు కాబట్టే చిరంజీవిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువత్తుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ కే పరిమితమైన చిరంజీవి సినీ కెరియర్.. పాన్ ఇండియాకి కూడా పరిచయం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు..

- Advertisement -

ఇక కమలహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియన్-2 సినిమాలో నటిస్తూనే.. ప్రభాస్ కల్కి2898AD సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నారు.. అలాగే థగ్ అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు