Rajasekhar: జీవిత – రాజశేఖర్ పెళ్లి వెనుక ఆ దర్శకుల హస్తం ఉందా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొన్ని కొన్ని సార్లు ఎవరూ ఊహించని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.. ఇలాంటి సంఘటనలు హీరోల విషయంలో జరిగితే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ఘటన సీనియర్ హీరో రాజశేఖర్ విషయంలో కూడా జరిగింది.. హీరో రాజశేఖర్ తమిళ్ నటుడు అయినప్పటికీ తెలుగు సినిమాల పైన మక్కువ చూపి తెలుగులో నటించి భారీగా పేరు సంపాదించారు. తమిళ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఒక సినిమాలో హీరోయిన్ గా జీవిత ను ఎంపిక చేశారట.

అప్పటికి ఇంకా వీరిద్దరూ కలసి ఏ సినిమాలో కూడా నటించలేదు.. జీవిత గ్లామరస్ గా ఉండడంతో తన పక్కన హీరోయిన్ గా ఆమె కరెక్ట్ కాదని రాజశేఖర్ భావించారట.. ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీగా ఉంటే బాగుంటుందంటూ.. జీవిత అందుకు విరుద్ధంగా ఉందంటూ దర్శక నిర్మాతలతో గొడవ పెట్టుకున్నారట .. అంతేకాదు వెంటనే హీరోయిన్ ని మార్చేయమంటూ దర్శక నిర్మాతల పై రాజశేఖర్ ఫైర్ కూడా అయ్యారట రాజశేఖర్ చెప్పింది విన్న తర్వాత అలాగే చేశారట దర్శక నిర్మాతలు.

మరో కొద్ది రోజులలో సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా చిత్ర యూనిట్ నుంచి రాజశేఖర్ కి ఎలాంటి కబురు రాలేదు.. దీంతో ఆ సినిమా ఆఫీసుకి ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందా అని టెన్షన్ పడుతున్న సమయంలో.. సరిగ్గా పది రోజుల తర్వాత సినిమా షూటింగ్ మొదలయ్యింది.. అయితే అందులో హీరోగా రాజశేఖర్ మాత్రం కాదు వేరే హీరోతో ఆ చిత్రాన్ని మొదలుపెట్టారట దర్శక నిర్మాతలు.. హీరోయిన్ ని మార్చమని అడిగినందుకు హీరోనే మార్చేశారట ఆ దర్శక నిర్మాతలు.

- Advertisement -

అయితే ఆ తర్వాత జీవిత గురించి ఆ దర్శక నిర్మాతలు రాజశేఖర్ కి జ్ఞానోపదయం చేశారని సమాచారం ఇక తర్వాత రాజశేఖర్ , జీవిత తెలుగు ఇండస్ట్రీకి రావడం .. ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించడంతో వీరికి మంచి పేరు కూడా లభించింది. అలా ఇద్దరు కలిసి నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ అన్యోన్యంగా తమ వైవాహిక బంధంతో ముందుకు వెళుతున్నారు రాజశేఖర్ , జీవిత.. వీరికి ఇద్దరు కుమార్తెలు.. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా పలు సినిమాలలో నటిస్తున్నారు..అంతేకాదు ప్రస్తుతం స్టార్ స్టేటస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు