Meera Chopra: పెళ్లికి సిద్ధమైన మరో బాలీవుడ్ బ్యూటీ..!

మాఘ మాసం మొదలైంది.. పెళ్లి సంబరాలు షురూ అవుతున్నాయి.. ఇప్పటికే సామాన్య ప్రజలు ఒక్కొక్కరుగా మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతుండగా .. సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు.. ఇక నిన్నటికి నిన్న అనగా ఫిబ్రవరి 21వ తేదీన ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ లు పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు మరో బ్యూటీ వివాహానికి సిద్ధమవుతోంది.. ఇక ఆమె ఎవరో కాదు మీరా చోప్రా.. ఈ ఏడాది కొత్త జీవితం మొదలు పెడతాను అని హింట్ ఇచ్చింది .

ఈమె అన్నట్లుగానే మార్చి 11 లేదా 12న జైపూర్ లో పెళ్లి చేసుకోబోతుందట. ఇప్పటికే మీరాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనులతో బిజీగా మారినట్లు సమాచారం. ఇక మీరా చోప్రా తన పెళ్లికి సుమారుగా 150 మందికి పైగా అతిధులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సెలబ్రెటీలు, బాలీవుడ్ లో ఉన్న తన స్నేహితులతో పాటు బంధువులు, అతిధుల కోసం ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా లకు కజిన్ అవుతుందన్న విషయం తెలిసిందే..

మీరా చోప్రా సినీ జీవిత విషయానికి వస్తే.. 2005లో అన్బే ఆరుయిరే చిత్రంతో తమిళ సినిమా ద్వారా వెండితెరపై అడుగులు వేసిన ఈమె.. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో నటించింది. ఇక తర్వాత మారో , వాన, గ్రీకువీరుడు వంటి సినిమాలు చేసిన మీరా చోప్రా ద టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలో కూడా అడుగుపెట్టి సత్తా చాటింది. ఇక ఈమె నటించిన సఫేద్ సినిమా గత ఏడాది జీ ఫైవ్ లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అలా తెలుగు చిత్రాలతోనే కాదు వెబ్ సిరీస్ ల ద్వారా కూడా అటు తెలుగు ఆడియన్స్ కు ఇటు హిందీ ఆడియన్స్ కు బాగా సుపరిచితురాలు అయిన మీరాచోప్రా ఇప్పుడు వివాహం చేసుకోబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అతడు ఏం చేస్తుంటారు. అన్న విషయాలు మాత్రం ప్రస్తుతం గోప్యంగా ఉంచారు.. ఇక త్వరలోనే అన్ని విషయాలు కూడా తెలియనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మీరా చోప్రా కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతుండడంతో సెలబ్రిటీలు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు