Radhika: ముఖ్యమంత్రిని రహస్యంగా పెళ్లి చేసుకుంది.. కానీ తమ మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు.. ఎప్పుడు? ఎవరితో? ప్రేమలో పడతారో చెప్పడం అసాధ్యం.. తమకు నచ్చాలి అంతే.. వయసుతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతం గా .. కుటుంబ సభ్యులను ఎదిరించి అయినా సరే తమకు నచ్చిన వారిని సొంతం చేసుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పెద్దలను ఎదిరించి.. అది కూడా వయసులో తనకంటే ఏకంగా 27 సంవత్సరాల పెద్ద అయినా ఒక వ్యక్తిని వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఇక ఆమె ఎవరో కాదు కన్నడ, తెలుగు హీరోయిన్ రాధిక.. తారకరత్నతో భద్రాద్రి రాముడు సినిమా చేసిన ఈమె తెలుగు ప్రేక్షకులలో బాగానే పేరు దక్కించుకుంది.

కన్నడ హీరోయిన్ అయినా ఈమె టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది.. కానీ కెరియర్లో స్టార్డం సంపాదించుకోలేక ఇండస్ట్రీ నుంచి దూరమైంది.. అయితే అలాంటి సమయంలోనే ఒక నిర్ణయం తీసుకోవడంతో.. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చడమే కాదు కర్ణాటక రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది .. రాధిక హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే జేడీఎస్ అధినేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించింది రాధిక.. ఇక సినిమాల్లో ఫేడౌట్ అయిన సమయంలో ఆయనను రహస్యంగా వివాహం కూడా చేసుకుంది. ఆమెతో ప్రేమలో మునిగిపోయిన మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి రాధికను 2006లో రహస్యంగా వివాహం చేసుకున్నారు.

అయితే వీరి రహస్య వివాహం మాత్రం 2010 లో బయటకొచ్చింది.. ఈ విషయాన్ని రాధికా స్వయంగా జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని వివాహం చేసుకున్నట్లు 2010లో స్వయంగా వెల్లడించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.. ఇకపోతే ఈ విషయాలు వెల్లడించిన తర్వాత కన్నడ మీడియా కొన్ని వార్తలను వైరల్ చేసింది. వాటిలో హెచ్డి కుమారస్వామి వయసు 47 సంవత్సరాలైతే రాధిక అతనికంటే 27 సంవత్సరాలు చిన్నది కావడం గమనార్హం.. కుమారస్వామికి ఇది రెండో వివాహం.. మొదట 1986లో వివాహం చేసుకున్నారు. మరొకవైపు రాధికకి కూడా ఇది రెండవ వివాహం అనే చెప్పాలి 2000వ సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె కొన్ని విభేదాల వల్ల అతడితో విడిపోయి ఆ తర్వాత కుమారస్వామిని ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకుంది.

- Advertisement -

ఇక రాధిక తన సినీ కెరియర్లో కేవలం 30 సినిమాల్లో మాత్రమే నటించింది. అంతేకాదు నిర్మాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం 36 ఏళ్ల రాధిక హీరోయిన్గా పూర్తిగా ఫ్లాప్ అయ్యింది.. కానీ తన తెలివితో బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధించిందని చెప్పాలి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వివాహం చేసుకున్న తర్వాత కోట్లాది రూపాయలను సంపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం రాధిక పేరు మీద రూ .130 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు