Kushboo: వ్యక్తిగత జీవితం పై ఎమోషనల్ పోస్ట్ చేసిన ఖుష్బూ. ఏం మారలేదంటూ..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ .. తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. 1990లో సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ.. తెలుగులో కూడా ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. 1995లో మరై మామన్ సినిమాలో నటిస్తున్న సమయంలోనే డైరెక్టర్ సుందర్ తో ప్రేమలో పడింది.. ఆ తర్వాత ఐదేళ్లకు 9-3-2000 సంవత్సరంలో డైరెక్టర్ సుందర్ ను వివాహం చేసుకుంది . వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను ఇటీవలే ఖుష్బూ పంచుకుంది. తన భర్త ప్రపోజ్ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు తన జీవితంలో ఎలాంటి మార్పులు జరగలేదంటూ కూడా ఈ పోస్టును షేర్ చేసింది.. సోషల్ మీడియా లేని రోజులలో కూడా వీరు ప్రపోజ్ చేసిన వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానంటూ ఖుష్బూ రాసుకొచ్చింది..

29 ఏళ్ల క్రితం తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా అత్యుత్తమైనదిగా భావిస్తున్నాను అంటూ తెలిపింది..22 ఫిబ్రవరి 1995 నుంచి 22 ఫిబ్రవరి 2024 వరకు అసలు ఏమీ మారలేదు.. కేవలం నా వయసు మాత్రమే మారుతోంది.. అంతే తప్ప మీలో ఉప్పు మిరియాల సువాసన అలాగే ఉంది అంటూ తెలిపింది.. ఇలా ఒకరిపై ఒకరి ప్రేమ గౌరవం , మన తప్పులను అంగీకరించడం, ప్రోత్సహించడం, ఆపద సమయంలో అండగా ఉండడం ఇదే మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నామనడానికి నిదర్శనం.

- Advertisement -

మీరు నాకు ప్రపోజ్ చేసి 29 సంవత్సరాలు అయింది.. ఎలాంటి కెమెరాలు , ఫోటోలు, సోషల్ మీడియాలో లేని రోజులలో కూడా మీ ప్రేమను అంగీకరించాను.. ఈ విషయంలో ఒక్కసారి కూడా ఆలోచించకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తమ నిర్ణయం గా భావిస్తున్నానని .. ఈరోజు మీరు ఆ విషయాన్ని నిరూపించారు అంటూ తెలిపింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానంటూ పోస్ట్ చేసింది.. చివరిగా తెలుగులో రామబాణం సినిమాలో నటించినది. కోలీవుడ్లో అగ్ర దర్శకుడుగా ఉన్న సుందర్ తమిళంలో 32 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. 20కి పైగా సినిమాలలో నటించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు