Jayalalitha: వారి వల్లే వివాహానికి దూరమైన జయలలిత.. ఏమైందంటే..?

దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం లో ఎన్నో వివాదాలు.. ఆమెను దగ్గర నుండి చూసిన అతి కొద్ది మందికి మాత్రమే అర్థమవుతాయి అనడంలో సందేహం లేదు. పెళ్లయిన ఇద్దరు నటులతో ప్రేమలో పడింది.. ఒకరు సౌత్ సినిమాల ఆకర్షనటుడు .. మరొకరు తమిళనాడు ముఖ్యమంత్రి.. ఇద్దరినీ ప్రేమించిన ఈమె ఇద్దరినీ వివాహం చేసుకోకుండానే ఒంటరి అయిపోయింది.. ఇకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి కి అప్పటికే పెళ్లయి భార్యా పిల్లలు ఉన్నారు.. ఇక ఆయనతో ఈమె సహజీవనం సమాజం నుండి వ్యతిరేకతలను ఎదుర్కొనేలా చేసింది.. అయితే మీ బంధానికి ఎలాంటి పేరు పెట్టాలని మీడియా అడిగినప్పుడు తలవంచి తప్పుకుందే తప్ప సమాధానం చెప్పలేదు.. అయితే ఈమె ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడంతో ఆమె హోదా పైగా అతడితో అనుబంధం పెరగడంతో పార్టీలో గుసగుసలు కూడా మొదలయ్యాయి.. ప్రజా జీవితంలో కోట్లాదిమంది జీవితాలను మార్చిన నటి వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రేమ ముందు నిస్సహాయంగా ఉండిపోయింది.

1960లో వెన్నిర ఆడై అనే బ్లాక్ బస్టర్ చిత్రంతో తెరగేట్రం చేసిన జయలలిత రియల్ లైఫ్ స్టోరీలో మాత్రం ఎన్నో ట్విస్ట్ లు.. తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రి కూడా అయింది. 1961, 1980 మధ్యకాలంలో 140 చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె స్టార్ హీరోయిన్గా కూడా ఒక వెలుగు వెలిగింది.. సినిమా, రాజకీయ జీవితంతో పాటు ప్రేమ వ్యవహారాల్లో కూడా వార్తల్లో నిలిచింది.. ముఖ్యంగా నటులు శోభన్ బాబు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ తో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు అయ్యాయి.. సౌత్ సినీ ప్రముఖ నటుడైన శోభన్ బాబుతో జయలలిత ప్రేమలో పడింది.. అతడికి పెళ్లయి భార్య పిల్లలు ఉన్నారన్నా కూడా ఆయనపై ఇష్టాన్ని చంపుకోలేకపోయింది. తరచూ ఇద్దరూ కలిసి కనిపించడం ప్రారంభించారు.. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఒకరోజు జయలలిత తనను పెళ్లి చేసుకోమని శోభన్ బాబుకు ప్రపోజల్ పెడితే.. ఆయన పిల్లలు, భార్య కారణంగా నిరాకరించాడు. దాంతో శోభన్ బాబుకు దూరమైంది జయలలిత..

ఆ తర్వాత ఎంజీఆర్ తో పరిచయం ఏర్పడింది.. తమిళ్లో 28 చిత్రాలలో వీరిద్దరూ నటించి భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక ఆయన కోరిక మేరకే రాజకీయాల్లోకి ప్రవేశించింది.. ఇద్దరి మధ్య చాలా ఘాడమైన సంబంధం ఏర్పడింది. జయలలిత ధైర్యం కూడగట్టుకుని ఎంజీఆర్ తో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు రెండో భార్య కారణంగా ఆయన కూడా ఈమెను అంగీకరించలేకపోయారు.. ఇక ఎంజీఆర్ కోరిక మేరకు ఎంజీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన జయలలిత స్థాయి వేగంగా పెరిగిపోయింది.. ముఖ్యంగా పార్టీలోని ప్రధాన వ్యక్తుల్లో ఈమెను ఒకరిగా లెక్కించడం ప్రారంభించారు జనాలు.. అదే సమయంలో వీరిద్దరి మధ్య సంబంధం పై ఇరువైపుల నుంచి ప్రశ్నలు రావడంతో ఎంజిఆర్ జయలలితకు దూరమయ్యారు.. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.. ఇక దీంతో జయలలిత మళ్లీ పెళ్లి చేసుకోలేదు.. అలా ఇద్దరిని ప్రేమించిన ఈమె ఇద్దరినీ కూడా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే బతికింది. ఇక రాజకీయాల్లోకి వచ్చి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా నిలిచి.. 2016 డిసెంబర్ 5వ తేదీన కన్ను మూసింది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు