Anasuya Bharadwaj : ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం – అనసూయ

Razakar

ఒకప్పటి జబర్దస్త్ యాంకర్, ప్రస్తుత టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రంగస్థలం లో రంగమ్మత్తగా టాలెంట్ చూపించిన అనసూయ ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ఎన్నో సినిమాల్లో నటిస్తూ బిజీ అయింది. అయితే ఈ భామ సినిమాల కంటే ఈ మధ్య వివాదాల తోనే ఎక్కువ ఫేమస్ అయింది. ఆ వివాదాల తోనే మరింత బిజీ అయిందని కూడా నెటిజన్లు అంటూ ఉంటారు. అయితే ఆ వివాదంలో కూడా తనకిష్టమైన వివాదం ఉందని అనసూయ లేటెస్ట్ గా వ్యాఖ్యలు చేసింది.

రీసెంట్ గా అనసూయ రజాకార్ చిత్రంలో నటించగా, ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న అనసూయ రజాకార్ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ తెలంగాణా చరిత్ర గురించి, మన మూలాల గురించి చెప్తుందని, మన అస్తిత్వాన్ని ముందుగా తెలుసుకోవాలని దాన్ని ఎవ్వరికైనా ఎలాగైనా చెప్పడానికి వెనకాడనని, ఇలా చెప్పే కొన్ని సార్లు వివాదాలపాలు కూడా అయ్యానని, కానీ ఈ వివాదం మాత్రం తనకిష్టమైన వివాదం అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

- Advertisement -

అలాగే రజాకార్ సినిమాలో తన రోల్ గురించి చెప్తూ ముందు ఈ సినిమా గురించి డైరెక్టర్ చెప్పినపుడు ఇంత చిన్న రోల్ ఎందుకు ఇస్తున్నారని కూడా అడిగానని, కానీ సినిమాలో నటించక, ఆ పాత్ర ఎంత ఇంపార్టెంటో తెలిసిందని అంది. ఇక ఈ సినిమాలో తన పాత్ర చూసాక సినిమాలో అనసూయ ఇంకా ఉంటె బాగుంటుందని ఆడియన్స్ అనుకుంటారని, అదే తన గెలుపవుతుందని అన్నది. ఇక అనసూయ రీసెంట్ గా ఫోటో షూట్ల ద్వారా ఎక్కువ వైరల్ అవగా ఈ రజాకార్ ఈవెంట్ ద్వారా తన స్పీచ్ తో పాజిటివ్ గా వైరల్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు