Anasuya Bharadwaj : భర్తతో కలిసి అనసూయ ప్రత్యేక పూజలు… అందుకేనా?

Anasuya Bharadwaj

హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా తన భర్తతో కలిసి తిరుమలను సందర్శించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ అక్కడ చేయించిన ప్రత్యేక పూజలపై ఆసక్తి నెలకొంది. అసలు ఈ బ్యూటీ తిరుమల శ్రీవారిని ప్రత్యేక పూజలు చేసి మరీ ఏం కోరుకుంది? ఇంతకీ ఈ సెలబ్రిటీ కపుల్ ప్రత్యేక పూజలు చేయడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

జబర్దస్త్ షో తో హాట్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకరింగ్ చేసి ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రతో తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అనసూయను వరుస అవకాశాలు వరించాయి. జబర్దస్త్ నుంచి ఏకంగా పాన్ ఇండియా మూవీ పుష్ప వరకు ఆమె రేంజ్ ఎదిగిపోయింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఈ బ్యూటీ చాలా బిజీగా ఉంది. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది అనసూయ. అందుకే టైం దొరికినప్పుడల్లా భర్తతో కలిసి షికార్లకు బయలుదేరుతుంది. ఇక పండగ దినాల్లో అయితే భర్త, పిల్లలతో కలిసి ఆమె చేసే సందడిని సోషల్ మీడియా ద్వారా చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే పలు వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ.

తాజాగా అనసూయ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కెరీర్ పరంగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఆమె ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనసూయ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Anasuya Bharadwaj latest photos in tirumala went viral

Anasuya Bharadwaj latest photos in tirumala went viral

Anasuya Bharadwaj latest photos in tirumala went viral

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనసూయ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన పార్ట్ షూటింగ్ కొంతమేరకు పూర్తయిందని సమాచారం. మరోవైపు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటుంది ఈ అమ్మడు. తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్న రోల్స్ మాత్రమే ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది అనసూయ. ఇక ఈ భామ కాల్షీట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతుండడం విశేషం. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనసూయ నటిస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు