HBD Jagapathi Babu : 1000 కోట్లకు వారసుడు కావాల్సిన జగ్గూ భాయ్… వాళ్లే అంతా నాశనం చేశారా?

HBD Jagapathi Babu

తెలుగు తో పాటు ఇతర భాషల్లో మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా మారిన జగ్గు భాయ్ పుట్టినరోజు నేడు. యాక్టింగే రాదంటూ హేళన చేసిన స్థాయి నుంచి ఏకంగా 7 నంది అవార్డులు అందుకుని, ప్రస్తుతం అన్ని భాషల్లోనూ అవకాశాలు మెండుగా అందుకుంటున్న నటుడు జగపతిబాబు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జగ్గు భాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా 1000 కోట్లకు వారసుడు కావలసిన ఆయన దారుణమైన ఫైనాన్షియల్ ఇష్యూస్ ను ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది? దానికి కారణం ఎవరు అన్న విషయాల్లోకి వెళ్తే…

1962 ఫిబ్రవరి 12న జన్మించిన జగపతి బాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. అలనాటి స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ వివి రాజేంద్రప్రసాద్ వారసుడు. ఇప్పటివరకు 100 సినిమాలకు పైగా నటించిన జగపతి బాబు అప్పట్లో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇక ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్ళాల కథలతో పాపులర్ అయిన హీరో జగపతి బాబు మాత్రమే. మద్రాస్ లో చదువు పూర్తి చేసిన జగ్గు భాయ్ ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా ఆయనకు సినిమాలు చేయాలన్న ఆలోచన లేదట. ఆయన తల్లి 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్ళొద్దు అని ఒట్టు వేయించుకున్నారట. అదే క్రమంలో చదువు పూర్తయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న తమ బిజినెస్ ను చూసుకున్నాడు.

అయితే ఆ తర్వాత రాత్రికి రాత్రి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకొని తన తండ్రి ప్రమేయం లేకుండానే సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాడట. తన తండ్రి నిర్మాత అయినప్పటికీ, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకోకుండా స్టార్ కావాలని అలా చేశారట జగపతిబాబు. అయితే ఆ తర్వాత వేరొకరి ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ తన కొడుకు ఇష్ట ప్రకారం 1989లో సింహ స్వప్నం సినిమా ద్వారా జగపతి బాబును హీరోగా పరిచయం చేశారు. మొదటి సినిమాతో పాటు ఆ తర్వాత రెండు మూడేళ్ల పాటు డిజాస్టర్లు చవిచూసిన జగపతిబాబు పట్టు వదలకుండా ప్రయత్నించి జగన్నాటకం, పెద్దరికం వంటి సినిమాలతో స్టార్ గా నిలదొక్కుకున్నారు. ఇక గాయం సినిమాతో మాస్ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శుభలగ్నం, మావిచిగురు, పెళ్లి పీటలు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు.

- Advertisement -

అయితే ఒకానొక సమయంలో జగపతి బాబు కెరీర్ ఇంకా అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలో లెజెండ్ సినిమాలో విలన్ పాత్రతో తిరిగి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు హీరోల కంటే ఎక్కువ బిజీగా ఉన్నారు. అయితే ఫామ్ కోల్పోయినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారట జగ్గు భాయ్. ఒక హీరో అయితే సెట్లో కనీసం సరిగ్గా భోజనం పెట్టలేదు సరి కదా గౌరవం కూడా ఇవ్వలేదట. ఇక ఇప్పటికే 1000 కోట్లకు వారసుడై ఉండాల్సిన జగ్గు భాయ్ పలు కారణాలవల్ల మొత్తం ఆస్తిని పోగొట్టుకున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా క్యాసినో వల్ల తాను మొత్తం డబ్బులు పోగొట్టుకోలేదని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు జగ్గు భాయ్. అయితే కొందరు మోసం చేయడం వల్ల అలా జరిగిందని, కానీ వాళ్లను తను బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు.

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు