Sithara : ఘట్టమనేని ప్రిన్సెస్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? మహేష్ మాత్రం కాదట!

సితార ఘట్టమనేని… పేరు మాత్రమే కాదు, సితార కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఒక ఎమోషన్ అని చెప్పాలి. ఇక ఇప్పటికే సినిమా అనేది నా రక్తంలోనే ఉందంటూ సితార టాలీవుడ్ లో నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్ గా రాబోతున్నానని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడు యాడ్స్ లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. తండ్రి మహేష్ బాబుకు తగ్గట్టే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. తండ్రి అందం పుణికి పుచ్చుకుని, తల్లి తెలివి తేటలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయంటే… ఏ స్టార్ హీరోయిన్ కూడా పనికిరాదు.

నిజానికి సితారకు చిన్నప్పటి నుంచే టాలీవుడ్ లో మరే స్టార్ హీరోయిన్ కు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సితారకు బాగా నచ్చే హీరో ఎవరు? ఇంకెవరు ఆమె తండ్రి మహేష్ బాబు సూపర్ స్టార్ కదా… ఆయనంటే సితారకు చాలా ఇష్టం కదా అనుకుంటున్నారేమో… అస్సలు కాదు. టాలీవుడ్ లో మహేష్ బాబుతో పాటు ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. సితార వాళ్ళందర్నీ కాదని, పాత తరం హీరోను ఫెవరెట్ హీరోగా ఎంచుకుంది.

టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ హీరోగా పాపులర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ అంటే సితారకు చాలా ఇష్టమట. ఓ ఈవెంట్ లో సితారా ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. తన ఫేవరెట్ యాక్టర్ తన తాతగారు కృష్ణ అని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ తన ఫేవరెట్ హీరో మాత్రం తన నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా ఈ సెలబ్రిటీ తండ్రీ కూతుళ్ళు ఇద్దరికీ ఒక్కరే ఫేవరెట్ హీరో కావడం గమనార్హం.

- Advertisement -

ఇక ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా కూడా వాళ్లకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా. అలాగే మనసుకు బాగా నచ్చే ఫుడ్, మూవీ, స్టార్.. ఇలా వాళ్లకు కూడా కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే విషయాలను తెలుసుకోవడం సాధారణ ప్రజలకు ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు సితార విషయంలో కూడా అదే ఇంట్రెస్ట్ తో ఉన్నారు తెలుగు ఆడియన్స్. అందుకే ఆమెకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు