Bigg Boss Telugu: ఉల్టా పుల్టా… నో ఎలిమినేషన్ – నెక్ట్స్ వీక్ డబుల్ ఎలిమినేషన్?

ఆదివారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌కు ముందు ఓ వార్త వైరల్ అయింది. అదేంటంటే… ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని. కానీ, ఆదివారం ఎపిసోడ్ చూస్తే… డబుల్ ఎలిమినేషన్ కాదు… నో ఎలిమినేషన్ అయింది. ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి రౌండ్ లో అశ్విని, గౌతమ్ ఉన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. నాగార్జున కూడా ఎలిమినేట్ అయినవాళ్లు… స్టేజ్ పైకి రావాలని, తాను వెయిట్ చేస్తున్నట్టు కూడా చెప్పాడు.

కానీ, ఇద్దరి చేతికి గ్రీన్ రావడంతో… నో ఎలిమినేషన్ అని తెలిసిపోయింది. దీంతో ఈ వీక్ నో ఎలిమినేషన్ అంటే… వచ్చే వారం పరిస్థితి ఏంటి? అని ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. ఈ వారం మిస్ అయింది.. మరి తర్వాత వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే డౌట్ కూడా వస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైనల్ వెళ్లేది కేవలం 5 గురు మాత్రమే. అంటే హౌస్ నుంచి ఇంకా 5 గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది.

11వ వారంలో ఎలాంటి ఎలిమినేషన్స్ జరగలేదు. ఫైనల్ వీక్ 15వ వారం. అంటే… ఎలిమినేషన్స్ ఏం జరిగినా, 12, 13, 14 వారాల్లోనే ఉండాలి. 5గురు కంటెస్టెంట్స్ ని మూడు వారాల్లో బయటికి పంపించాలి అంటే.. ఒక్క వారం కాదు.. రెండు వారాల్లో డబుల్ ఎలిమినేషన్ జరగాలి. అయితే ఇది ఉల్టా పుల్టా కాబట్టి.. 12వ వారం లో ఎలిమినేషన్స్ లో ఇద్దరిని ఇంటికి పంపించి, తర్వాత వారాల్లో ఒక్కొకరిని ఎలిమినేట్ చేసి, ఫైనల్ రౌండ్ కి 6గురు కంటెస్టెంట్స్ ని తీసుకెళ్లే ఆలోచన కూడా చెయొచ్చు. కానీ ఈ 12వ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్స్ అయితే పక్కా అని సమాచారం.

- Advertisement -

ఈ 12 వారం నామినేషన్స్ ప్రక్రియ ఆదివారం షూట్ చేశారు. సింహానికి ఆహారం అనే పేరుతో ఈ నామినేషన్ ప్రక్రియ జరిగింది. దీనిలో భాగంగా.. ప్రతి కంటెస్టెంట్.. ఇద్దరిని నామినేట్ చేస్తూ.. వారి ఫోటోలను సింహం బొమ్మ నోట్లో వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నామినేట్ చేయడానికి కారణాలు చెప్పాలి. ఇలా టాస్క్ పూర్తి అయిన తర్వాత చూస్తే హౌస్ లో ఉన్న 10 మందిలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలుస్తుంది. ప్రియాంక కెప్టెన్ కాబట్టి… నామినేషన్స్ ను సేఫ్ అయింది. అలాగే శోభా కూడా నామినేషన్స్ లోకి రాలేదు.

శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అశ్వినీ, రతిక రోజ్, అర్జున్, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ సారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ లో ఉండటం వల్ల ఓటింగ్ కాస్త ఆసక్తికరంగా ఉండబోతుంది. అయితే ఫైనల్ గా మాత్రం అశ్వినీ, రతిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ రతికను బిగ్ బాస్ సేఫ్ చేయాలి అనుకుంటే.. అశ్వినీతో పాటు గౌతమ్ ఇంటి నుంచి బయటికి రావొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు