Akhil : అక్కినేని వారసుడు మళ్ళీ బిగ్ రిస్క్ చేస్తున్నాడా?

అక్కినేని అఖిల్ మళ్లీ పెద్ద రిస్క్ చేస్తున్నాడా ? టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. గత చిత్రం “ఏజెంట్” అక్కినేని ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. దీంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని చేయడానికి రెడీ అవుతున్నారు. అఖిల్ ఇప్పటికే యువి క్రియేషన్స్ బ్యానర్‌తో భారీ బడ్జెట్ మూవీ కమిట్ అయ్యాడు. అయితే ఇప్ప్పుడు ఈ మూవీతోనే మరోసారి అఖిల్ రిస్క్ తీసుకుంటున్నాడనే టాక్ స్టార్ట్ అయ్యింది.

నిజానికి “ఏజెంట్” రిజల్ట్స్ తర్వాత అఖిల్ మళ్లీ పెద్ద ప్రాజెక్ట్‌కి చేయాలా ? లేదంటే మీడియం బడ్జెట్ మూవీ చేయొచ్చా ? అనే డైలమాలో పడిపోయాడు. ‘ఏజెంట్’ సినిమా బ్యాడ్ రిజల్ట్ కారణంగా అఖిల్ తన నెక్స్ట్ మూవీని ఫిక్స్ చేయడానికి చాలా ఆలోచించాడు. ఆ మూవీ భారీ డిజాస్టర్ కావడం అఖిల్ అభిమానులను అతని కెరీర్ గురించి ఆందోళన చెందేలా చేసింది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ మూవీ అంటే ప్రస్తుతం అఖిల్ కు ఉన్న మార్కెట్ ప్రకారం ఆ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా నిర్మాతలు మునిగిపోవడం ఖాయం. మీడియం రేంజ్ బడ్జెట్ అంటే నిర్మాతలు కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం మరోసారి ధైర్యం చేసి బిగ్ బడ్జెట్ మూవీ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. .

ఇప్పుడు ఎట్టకేలకు యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయబోతున్నాడు అఖిల్. ఈ సినిమా బడ్జెట్ పేపర్‌లోనే 80 కోట్లకు పైగా ఉంటుందని, షూటింగ్ పూర్తయ్యే నాటికి 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2024 వేసవి ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అఖిల్ పై మరీ ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టడమే రిస్క్ అనుకుంటూ ఉంటే, ఆయన కెరీర్ ను ఓ కొత్త దర్శకుడి చేతిలో పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అన్ని చర్చించుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఫస్ట్ మూవీ కాబట్టి సదరు డైరెక్టర్ కు దర్శకత్వంపై అంతగా పట్టు ఉండే అవకాశం లేదు. డైరెక్టర్ కారణంగా ఈ సినిమా గనక డిజాస్టర్ అయితే ఇక అఖిల్ పాతాళంలోకి పడిపోవడం ఖాయం. మరి ఈ పరిష్టితిని ఈ యంగ్ హీరో ఎలా నెట్టుకు వస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు