Akhil: అయ్యగారికి ఫైనల్ గా ఇప్పుడు సెట్ అయింది… డైరెక్టర్ పెద్ద సాహసమే

అఖిల్ అక్కినేని, సిసింద్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన అఖిల్ “అఖిల్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత అఖిల్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. మంచి అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు కూడా బోల్తా కొట్టాయి. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ఒక మంచి హిట్టును అందుకున్నాడు అఖిల్. ఆ సినిమా కేవలం అఖిల్ కి మాత్రమే కాదు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఊపిరి పోసింది అని చెప్పొచ్చు. దాదాపు భాస్కర్ కెరియర్ అయిపోయింది అనుకునే తరుణంలో ఆ సినిమా మళ్లీ కొత్త అవకాశాలను దర్శకుడుగా భాస్కర్ కి తెచ్చి పెట్టింది.

ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ సినిమా తర్వాత అఖిల్ చేసిన సినిమా “ఏజెంట్”. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమాపై అందరికీ భారీ అంచనాలు అప్పట్లో ఏర్పడ్డాయి. కానీ అవన్నీ తలకిందులుగా అయిపోయాయి. మినిమం కూడా ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీనితో అటు అఖిల్ కు ఇటువైపు సురేందర్ రెడ్డికి కూడా అవకాశాలు లేకుండా పోయాయి.

ఇకపోతే అఖిల్ ప్రస్తుతం ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టనున్నాడు. సాహో సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ అనే ఒక యంగ్ డైరెక్టర్ తో అఖిల్ సినిమాను చేయనున్నాడు. అలానే అనిల్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపుగా 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అఖిల్ ను నమ్మి 100 కోట్లు పెట్టడం మాములు విషయం కాదు. బహుశా కథలో కూడా అంత సత్తా ఉంది ఉండొచ్చు. అఖిల్ కెరియర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు