Aadikeshava: నిర్మాత- ట్రైలర్ లేట్ అవుతుంది.. ఆడియన్స్- సినిమా రిలీజ్ కాకున్నా పర్వాలేదు

హారిక హాసిని క్రియేషన్స్ ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క అజ్ఞాతవాసి సినిమా మినహాయిస్తే ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంకొన్ని సినిమాలు బాహుబలి తరువాత ఆ స్థాయిలో కలెక్షన్ వసూలు చేసి వసూలు చేశాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే ఈ హారిక హాసిని బ్యానర్ లో సినిమాలు చేస్తాడు. నితిన్ అ ఆ సినిమా మినహాయిస్తే ఈ బ్యానర్లో వచ్చిన చిన్న సినిమా అంటూ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో మాత్రమే ఈ బ్యానర్లు సినిమాలు నిర్మితమయ్యాయి.

ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ని ఏర్పాటు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు వచ్చే సినిమాలు అన్నిటికీ నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా మంచి సినిమాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గవి ప్రేమమ్, బాబు బంగారం, జెర్సీ, డీజెటిల్లు, సార్, ఇంకా రీసెంట్ టైమ్స్ లో మ్యాడ్ వంటి సినిమాలు ఈ బ్యానర్ కి మంచి పేరును తీసుకొచ్చాయి.

ఇకపోతే ఈ బ్యానర్ లో ఇప్పుడు పలు సినిమాలు నిర్మితమవుతున్నాయి. వాటిలో వైష్ణవ తేజ్ శ్రీ లీల కలిసి నటిస్తున్న ఆదికేశవ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా రిలీజ్ ని చాలాసార్లు అనౌన్స్ చేస్తూ పోస్ట్ పోన్ చేశారు. ఇకపోతే రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా యొక్క ట్రైలర్ను పోస్ట్ పోన్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది మూవీ టీం. వీటిపై నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

ట్రైలర్ లేట్ అవుతుంది క్షమించండి అని వేసిన ట్వీట్ కి సినిమా కూడా ఆపేయండి సినిమా గురించి ఎవరూ వెయిట్ చేయట్లేదు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇకపోతే దీనికి అనుసంధానంగా ఉన్న బ్యానర్ హారిక హాసినిలో రాబోతున్న గుంటూరు కారం సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఆదికేశవ విషయంలో చాలాసార్లు లేట్ జరుగుతూ వస్తుంది. ఏదేమైనా సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా బ్రహ్మరథం పడతారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు