Ajay Bhupathi: సముద్రం లోతునుంచి పైకి లేచినట్లేనే

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమా చాలా తక్కువ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక సంచలనంలా మారింది. పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అజయ్ భూపతికి అవకాశాలను తీసుకుని వచ్చింది. పెద్దపెద్ద హీరోలకి కథలను వినిపించే ఛాన్స్ కూడా ఆర్ఎక్స్ 100 సినిమా ఇప్పించింది అని చెప్పొచ్చు. ఆర్ఎక్స్ 100 సినిమా మొదటి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది.

ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ని అజయ్ చూపించిన విధానం ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి చేసిన సినిమా “మహాసముద్రం” శర్వానంద్ సిద్ధార్థ యంగ్ హీరోస్ కలిసి నటించిన సినిమా అవడం వలన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతికి అవకాశం రావడం చాలా కష్టమైంది. సినిమా ఫెయిల్ అయినా కూడా టెక్నికల్గా అజయ్ భూపతి ఒకరకంగా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఆ సినిమా ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కూడా అజయ్ భూపతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ నెక్స్ట్ టైం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అంటూ చెప్పుకొచ్చాడు అప్పట్లో.

ఇకపోతే రీసెంట్ గా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అజయ్ భూపతి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడంటూ కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

ఏదేమైనా టీజర్ తోనే ఈ సినిమా పై మంచి అంచనాలు కలిగాయి. దానికి తోడు కాంతారా వంటి హిట్ సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందించడం కూడా కొంతమేరకు ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మహాసముద్రం లోతు నుంచి అజయ్ ని పైకి లేపి కొత్త ఊపిరి పోసిందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు