NBK109: బాలయ్య విషయంలో బాబీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.?

ప్రముఖ డైరెక్టర్ బాబీ ఇటీవలే చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించి భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేసి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తన తదుపరి సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కూడా చాలా భిన్నమైన యాక్షన్ తరహాలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగావంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణం విభాగంలో త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ఫార్చ్యూన్ ఫోర్ కూడా ఒక భాగం కానుంది.దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలవగా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం మరొక యంగ్ హీరోని తీసుకోబోతున్నట్లు సమాచారం. దర్శకుడు బాబి ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవితేజను తీసుకొచ్చి సినిమా సక్సెస్ అయ్యేలా చేశారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో ఇదే ఫార్మేట్ ని ఫాలో అవుతూ మలయాల నటుడు దుల్కర్ సల్మాన్ ను రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఇక ఈయన అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ షేడ్ అయిన పాత్రలైనా సరే పర్ఫెక్ట్ గా చేయగలడు అని నిరూపించారు. కాబట్టి ఇప్పుడు బాలయ్య సినిమాలో దర్శకుడు బాబి ఈయనను ఎలా ప్రెసెంట్ చేయబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కూడా భాషతో సంబంధం లేకుండా అటు నార్త్ ఇటు సౌత్ లో కూడా అవకాశాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.

- Advertisement -

మరి ఇప్పుడు బాలకృష్ణ , బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనేది ఉత్కంఠ గా మారింది. ఇక మరోవైపు చిరంజీవి సినిమాలో ఉపయోగించిన ఫార్మాట్నే బాలయ్య సినిమాకి కూడా బాబి ఉపయోగిస్తున్నారు. అక్కడ సక్సెస్ అయ్యింది మరి ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలు బాలయ్య అభిమానులలో నెలకొన్నాయి. మరి బాబి ఏ మేరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తారు ? బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు మరింత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు