Telugu Singer: నమ్మి మోసపోయా.. రెండో పెళ్లిపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు దక్కించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ అభిమానులకు మరింత చేరువవుతోంది. ఇకపోతే సింగర్ సునీతకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా సరే ఆమె వాటిని కాదనుకొని సింగర్ గానే తన కెరీర్ ను కొనసాగిస్తోంది. కెరియర్ పరంగా సక్సెస్ అందుకున్నా కూడా వైవాహిక జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది సునీత. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో గడిచిపోయిన గడ్డు కాలాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది . ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి.

17 సంవత్సరాలకు సినీ పరిశ్రమకు వచ్చిన సునీత సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అతని నిజ స్వరూపం తెలుసుకొని విడిపోయిన సునీత.. ఒంటరిగా ఎన్నో అవమానాలను భరించి.. తన ఇద్దరు పిల్లలను ప్రయోజకుల్ని చేసింది. అయితే ఇటీవల 2021 జనవరిలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న ఈమె 42 ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇదే సమయంలో పలువురు సెలబ్రిటీలు ఈమెకు అండగా నిలిచారు. తన వ్యక్తిగత నిర్ణయాన్ని విమర్శించడానికి మీరెవరు అంటూ ఖండించారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన జీవితాన్ని మళ్లీ గుర్తు చేసుకుంది.

సునీత మాట్లాడుతూ..” జీవితంలో కష్టసుఖాలు అన్నవి సర్వసాధారణం.. అయితే వాటిని మనం ఎలా ఎదుర్కొన్నామనేది ముఖ్యం.. నా లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను నేను మర్చిపోయాను.. బంధువులు ఆ రోజున నువ్వు ఏడుస్తుంటే చాలా బాధేసింది అని గుర్తు చేసిన ప్రతిసారి ఆవేదన కలిగింది.17 ఏళ్లకే కెరియర్ మొదలుపెట్టాను .. 19 ఏళ్లకే పెళ్లి, సంపాదన.. 21 ఏళ్లకే కొడుకు.. 24 ఏళ్లకు కూతురు.. అన్ని అలా జరిగిపోయాయి.. నాన్న వ్యాపారం చేసి నష్టపోయారు. ఉన్న ఇల్లు కూడా పోయింది.. 35 ఏళ్లు వచ్చే వరకు కష్టపడ్డాను. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని.. అయితే నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను మోసం చేశారు. చాలామంది నాది ఫేక్ స్మైల్ అంటారు ఇక నాకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే చెప్పడానికి ఇష్టం లేకపోతే నవ్వి వదిలేస్తాను. అందుకే అందరూ ఫేక్ స్మైల్ అంటారు. అప్పుడు చాలా మోసపోయాను కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని రెండో వివాహం చేసుకున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను” అంటూ ఆమె తెలిపింది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు