Tollywood: అతనే బ్రాహ్మణి సినీ కెరియర్ కు శాపంగా మారారా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుస హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన మరొకసారి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా సాధారణంగా ఒక హీరో ఇండస్ట్రీలో సక్సెస్ అయిన తర్వాత తన వారసులను ఇండస్ట్రీకి తీసుకురావాలని చూస్తారు. ఈ క్రమంలోనే బాలయ్య కూడా తన కొడుకు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈయనకు హీరోయిన్స్ రేంజ్ లో ఉండే ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే వారు మాత్రం ఇండస్ట్రీకి పరిచయం కాలేదు.

ఇక బాలయ్య వారసురాళ్ళ సినీ కెరియర్ విషయానికి వస్తే.. బాలయ్య కి మోక్షజ్ఞతో పాటు బ్రాహ్మణి , తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్న విషయం తెలిసిందే . వీరిద్దరూ కూడా అందం విషయంలో హీరోయిన్ల గురించి ఏమాత్రం తీసిపోరు. నారా బ్రాహ్మణి ఫారెన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఉన్నతమైన చదువులు చదివిన ఈమె చూడడానికి అచ్చం కుందనపు బొమ్మలా ఉంటుంది. అందుకే ఈమెను తప్పకుండా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి తీసుకొస్తారని అందరూ భావించారు. దర్శక నిర్మాతలు కూడా బాలకృష్ణ వద్దకు వెళ్లి తమ కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తామని అడిగారట. కానీ దానికి బాలయ్య ఒప్పుకోలేదని, తన కూతుర్ని ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఆయన అడ్డుకట్టగా మారారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అంతేకాదు బాలకృష్ణ నారా బ్రాహ్మణి సినీ కెరియర్ కు శాపంగా మారారు అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేకపోయింది. అసలు విషయం ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అనే ఆలోచన ఆమెకు లేకపోవడం వల్లే బాలయ్య అలా చెప్పారని తెలుస్తోంది. ఇకపోతే సీనియర్ నటుడు ఎన్టీఆర్ మనవరాలుగా, బాలకృష్ణ కుమార్తెగా ఎంతో సినీ నేపథ్యం ఉన్న నారా బ్రాహ్మణి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేకపోవడమే ఆమె సినీ ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం అయిందట. మరోవైపు వ్యాపార రంగంలో కొనసాగాలన్న ఆసక్తితోనే ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇక సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేని బ్రాహ్మణి అభిరుచులను తెలుసుకున్న బాలయ్య తనకు ఇష్టమైన రంగంలోనే కొనసాగాలని ఆమెను ప్రోత్సహించారట. అందుకే నేడు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు దక్కించుకుంది నారా బ్రాహ్మణి. ఇక ఈ స్థానం కోసమే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారని సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు