NBK109: బాలయ్య సినిమా కోసం లైన్లో ఇద్దరు భామలు?

నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. రెండేళ్ల ముందు వరకు కెరీర్లో చాలా డౌన్ లో ఉన్న బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. రీసెంట్ గా బాలకృష్ణ భగవంత్ కేసరితో సెమి హిట్ ని కొట్టగా, మళ్ళీ పెద్దగా గ్యాప్ కూడా తీసుకొకుండా బాబీ సినిమా మొదలెట్టేసాడు. ఈరోజే షూటింగ్ కూడా స్టార్ట్ అవగా, సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ సమాచారం ఒక్కొక్కటి గా అందుతున్నాయి.

ఇక బాలయ్య 109 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా తమన్నా ని హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ప్రస్తుతం తమన్నా ఉన్న పరిస్థితుల్లో ఆమె కూడా ఈ సినిమాని వదులుకోదని అనిపిస్తుంది.

ఒకవేళ తమన్నా కి ఈ ఛాన్స్ మిస్ అయితే కాజల్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో నిర్మాత నాగ వంశీ ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో కాజల్ అగర్వాల్ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో లో రాబోయే సినిమాకి అడ్వాన్స్ తీసుకున్న కారణంగా ఆమె డేట్లు ఉండనే ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ వెంకీ కాంబో ఇప్పుడప్పుడే పట్టాలెక్కేటట్టు లేదు. కాబట్టి ఆ కాల్షీట్లు నాగవంశీ వాడుకుని కాజల్ ని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

- Advertisement -

పైగా సినిమాని సమ్మర్ లోపే పూర్తి చేద్దామని చూస్తున్నారు కాబట్టి పెద్దగా ఆలోచించకుండా తమన్నా, కాజల్ ఇద్దర్లో ఎవర్నో ఒకర్ని వెంటనే తీసుకునే అవకాశం ఉంది. ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు