Biggboss season7: ఈ వారం శివాజి వోటింగ్ లో టాప్ కి రావడం గ్యారెంటీ!

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 సాలిడ్ గా రన్ అవుతుంది. గత రెండు వారాలు గా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య భీభత్సంగా గొడవలు జరగగా, తేజ ఎలిమినేషన్ తర్వాత సైలెంట్ అయ్యారు. అది బాధ వాళ్ళో లేక మరేదైనా కారణమో తెలీదు గాని కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ టైం లో కూడా మరీ అంత వాగ్వాదం కూడా జరగలేదు.

అయితే నిన్నటి నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబెర్స్ రాక తో కొత్త జోష్ మొదలైంది. నిన్న ఎపిసోడ్ లో శివాజీ, అర్జున్, అశ్విని ఫ్యామిలీ మెంబెర్స్ రాగా, ఈరోజు గౌతమ్, ప్రియాంక, భోలే ఫ్యామిలీ మెంబర్లు రావడం జరిగింది.

అయితే వీళ్ళలో శివాజీ కొడుకు వచ్చినపుడు మాత్రం చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. శివాజీకి తెలియకుండా ఒక డాక్టర్ లాగా మాస్క్ వేసుకుని వచ్చి చెకప్ చేసి, ఆ తర్వాత నానా అని పిలవగా, అప్పుడు శివాజీ షాక్ అయిన సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తన చదువు కోసం విదేశాలకి వెళ్తున్న కొడుకు శివాజీకి కూడా సెండాఫ్ ఇవ్వడానికి వచ్చాడని తెలిసింది.

- Advertisement -

అది విన్న శివాజీ చాలా ఎమోషనల్ అయినా, హ్యాపీ అయ్యాడు. అయితే నామినేషన్ లో ఉన్న శివాజీ ఈ ఎపిసోడ్ తో తన వోటింగ్ తో టాప్ లోకి రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. పైగా ఈ వారం నామినేషన్ లో కూడా ఐదుగురే ఉండగా వాళ్లలో టాప్ లో శివాజీ ఉంటాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు