Production Houses: సినిమాలకి కోట్లు పెడతారు , ఒక వైఫై రూటర్ పెట్టలేరా

ప్రస్తుత కాలంలో సినిమాలకు సంబంధించి అప్డేట్లు ఇచ్చే విధానం మారిపోయింది. ఎంతలా మారిపోయింది అని అంటే ఒక అప్డేట్ ఇవ్వడానికి కూడా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ముందు ఆడియో లాంచ్ జరిగేది. తర్వాత ఆడియోలో అన్ని పాటలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుడిని ఆకట్టుకునేయి. ఈ పాటల్ని ప్రేక్షకుడు బాగా విని థియేటర్ కెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. ప్రతి పాటకి సప్రైజ్ ఫీల్ అవుతూ ఉండేవాడు.

ఇప్పుడు ఆరు పాటల్ని ఒకేసారి కాకుండా ఒక్కో పాటను ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ పాట రిలీజ్ కంటే ముందు కూడా ఒక 30 సెకండ్లు మాత్రమే వదులుతారు. ఇంతే కాకుండా సినిమా ట్రైలర్ కంటే ముందు టీజర్ అంటూ, టీజర్ కంటే ముందు, గ్లిమ్స్ అంటూ అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇకపోతే కొన్నిసార్లు ట్రైలర్ అనౌన్స్మెంట్లు టీజర్ అనౌన్స్మెంట్లు సాంగ్ అనౌన్స్మెంట్లు చేసి ఆ టైం కి పోస్ట్ పోన్ చేయడం కూడా రీసెంట్ టైమ్స్ లో చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం.

అయితే ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక మాట ఇచ్చింది అని అంటే ఆ మాట మీద నిలబడుతూ ఉండాలి. ఎందుకంటే ఆడియన్స్ అనేవాళ్ళు ఎంతో సహనంతో తమ అభిమాన హీరో ట్రైలర్ గానీ, టీజర్ గాని, సాంగ్ గాని రిలీజ్ అవుతుందని వెయిటింగ్ చేస్తారు. కానీ అప్పటివరకు వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ని ఒకేసారి కొన్ని అనివార్య కారణాలు అంటూ ఇవ్వాల్సిన అప్డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు. ఇది ఆడియన్స్ లో కొద్దిపాటి అసహనాన్ని క్రియేట్ చేస్తుంది.

- Advertisement -

ఇకపోతే రాదేశ్యామ్ సినిమా విషయంలో ఇలానే చాలా అప్డేట్లు లేట్ అవుతూ వచ్చాయి. అయితే నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్లో అసలు యూ వీ క్రియేషన్స్ కి ఏమైంది ఏమైనా రూటర్ ప్రాబ్లమా అంటూ ఒక సరదా సందర్భంలో సెటైర్ వేశాడు. ఇకపోతే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కి రూటర్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న టైం కి ఏది కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రేక్షకుడి సహనానికి పరీక్షల అనిపిస్తుంది. చివరి నిమిషం వరకు సాంగ్ గాని టీజర్ గానీ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే, అది పూర్తి అయిన తరువాత దాన్ని అనౌన్స్ చేయడం మంచిదని చాలామంది అభిప్రాయం. ఇకపోతే సినిమాలకు కోట్లు ఖర్చుపెట్టి, అప్డేట్ ఇవ్వడానికి ఒక మంచి రూటర్ని పెట్టుకోలేరా అంటూ కొంతమంది ట్రోల్ల్స్ కూడా మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది.

Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు