Sapta Sagaraalu Dhaati Side B : బాక్స్ ఆఫీస్ నుంచి సైడ్ అయిపోయిన మూవీ… అదేమో రాడ్, ఇదేమో రొట్ట !

కన్నడ హీరో రక్షిత్ శెట్టి తాజాగా “సప్త సాగరాలు ధాటి సైడ్ బి” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేశారు. ఈ రొమాంటిక్ డ్రామాకు హేమంత్ దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి తన సొంత బ్యానర్ పరమవా స్టూడియోస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. “సప్త సాగరాలు ధాటి సైడ్ ఏ” మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాగా, దానికి సీక్వెల్ గా “సప్త సాగరాలు ధాటి సైడ్ బి” సినిమాను రెండ్రోజుల క్రితం రిలీజ్ చేశారు.

ఇక ఫస్ట్ పార్ట్ విషయానికొస్తే… “సప్త సాగరాలు ధాటి సైడ్ ఏ” మూవీ ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. ఇక మిగతా వాళ్లంతా దీనికంటే వెబ్ సిరీస్ బెటర్, ఇలాంటి సోది సినిమాలతో ఎందుకు మా ప్రాణాలు తీస్తారు అంటూ ట్రోల్ చేశారు. సినిమా నిడివి, సన్నివేశాలను లాగదీసిన తీరుపై టాలీవుడ్ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఈ మూవీకి సీక్వెల్ గా “సప్త సాగరాలు ధాటి సైడ్ బి” వచ్చింది.

ఇక ఈ మూవీ రిలీజ్ అవ్వడమే నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ పెద్ద రాడ్ అంటే, సెకండ్ పార్ట్ పెద్ద రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా… దీనికంటే ఫస్ట్ పార్టే ఎంతో కొంత నయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగెటివిటీ అంతా ఇప్పుడు సినిమా ఉన్న థియేటర్ల ఆక్యుపెన్సీపై, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలేమీ లేకపోయినా “సప్త సాగరాలు ధాటి సైడ్ బి” టీం ఈ రొటీన్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. కనీసం ఒక్క థియేటర్ కూడా హౌజ్ ఫుల్ కాకపోవడమే అందుకు నిదర్శనం. అసలు ఈ మూవీ రిలీజ్ అయ్యిందన్న విషయం చాలామంది తెలుగు ఆడియన్స్ కు తెలియదు. దీంతో ఈ సినిమాను టాలీవుడ్ సినీ ప్రియులు పక్కకు పెట్టేసినట్టు అర్థం అవుతోంది.

- Advertisement -

మరోవైపు వరల్డ్ కప్ ఫీవర్ కూడా ఈ సినిమాపై ఆసక్తి తగ్గడానికి కారణమైంది. అయితే ఆకట్టుకునే కథ ఉంటే, బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత కలెక్షన్స్ అయినా వచ్చేవి. ‘మంగళవారం’ సినిమా కూడా అదే రోజు విడుదలైంది. కథ, కథనం, నటీనటులు, బ్యాగ్రౌండ్ స్కోర్ వంటివి బాగుండడంతో ఆ టీం సేఫ్ అయ్యింది. కానీ “సప్త సాగరాలు ధాటి సైడ్ బి” మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం రక్షిత్ శెట్టి
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు