Nagarjuna: సౌత్ ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా నాగ్.. ఎన్ని రూ.వేల కోట్లంటే..?

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనగానే ముందుగా మనకు రజనీకాంత్ , కమలహాసన్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ , అజిత్ , విజయ్, మోహన్ లాల్, యశ్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా సూపర్ స్టార్ లు గుర్తుకొస్తారు. ముఖ్యంగా వీళ్ళల్లో ఎవరో ఒకరు సంపాదనలో మాత్రం మొదటి స్థానంలో ఉంటారని అందరూ అనుకుంటారు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఆస్తుల విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉండడం గమనార్హం.GQ నివేదికల ప్రకారం రూ.3010 కోట్ల నికర ఆస్తితో అత్యంత ధనవంతుడి అయిన దక్షిణాది నటుడిగా అక్కినేని నాగార్జున రికార్డు సృష్టించారు.

64 సంవత్సరాల వయసులో కూడా ఈ సీనియర్ హీరో నిర్మాతగా, టీవీ షో హోస్ట్ గా , ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇకపోతే గత మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా పనిచేస్తున్న ఈయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు తన తండ్రి ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మాతగా సినిమాలు చేస్తూ తన డబ్బును మరింత పెంపొందించుకుంటున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీ పెట్టుబడులు పెట్టిన ఈయన ఇండియన్ సూపర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్ సి జట్టుకి కూడా సహా యజమానిగా వ్యవహరిస్తున్నారు.

అంతేకాదు హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ పేరిట ఒక గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు . ఇందులో సెలబ్రిటీల ఫంక్షన్లు చాలా వరకు ఇక్కడే నిర్వహిస్తూ ఉంటారు.దీనికి తోడు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా నాలుగు వైపుల నుంచి ఆదాయాన్ని పొందుతున్న నాగార్జున సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ గా పేరు దక్కించుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ మొత్తం నికర ఆస్తిలో హైదరాబాదులోని రూ.45 కోట్ల విలువ చేసే బంగ్లా, విలాసవంతమైన కార్లు అంతేకాదు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఆయన సొంతం.

- Advertisement -

ఇలా భారీగా రోజురోజుకు ఆస్తులు పెంచుకుంటూ రిచెస్ట్ హీరోగా చరిత్ర సృష్టిస్తున్నారు నాగార్జున. ఇక నాగార్జున విషయానికొస్తే ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తేనే మరొకవైపు బిగ్ బాస్ వంటి రియాల్టీ షోలకు గత 5 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది . ఏది ఏమైనా నాగార్జున అందం విషయంలోనే కాదు ఆస్తుల విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటారని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు