Amma Rajasekhar : ఇండస్ట్రీకి మరో వారసుడు.. ఎంట్రీ ఎప్పుడంటే.

Amma Rajasekhar.. ఏ రంగంలో అయినా సరే వారసత్వం పరిపాటిగా వస్తూ ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ వారసత్వం అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.. పెద్దపెద్ద స్టార్ హీరో హీరోయిన్లను మొదలుకొని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో తమకు తాము ఒక గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాత.. తాము ఫేడ్ అవుట్ అవుతున్నామన్న సమయంలో.. తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.. అలా ఇప్పటికే ఎంతోమంది సెలెబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే… మరి ముఖ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీ వారసులంతా.. సక్సెస్ పొందారా అంటే అదీ లేదు ..కొంతమంది సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎదిగితే.. మరి కొంతమంది ఆ టాలెంట్ ను ఉపయోగించుకోలేక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. మరి కొంతమంది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగులు వేస్తూ ఉంటారు.. అలాంటి వారిలో ఇప్పుడు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ కూడా ఒకరు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

హీరోగా అమ్మ రాజశేఖర్ కొడుకు ఇండస్ట్రీకి ఎంట్రీ..

Amma Rajasekhar : Another heir to the industry.. When is the entry?
Amma Rajasekhar : Another heir to the industry.. When is the entry?

అసలు విషయంలోకి వెళ్తే ..తాజాగా హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడిలో అమ్మ రాజశేఖర్ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.. ఈ వేడుకల్లో ఆయన భార్యా పిల్లలతో పాటు కొంతమంది స్నేహితులు కూడా పాల్గొని.. అమ్మ రాజశేఖర్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేమిటంటే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. తన డైరెక్షన్ లోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోందని ఆయన స్పష్టం చేశారు.. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అమ్మ రాజశేఖర్ తెలిపారు.. మొత్తానికైతే తన వారసత్వాన్ని ఇండస్ట్రీలో కొనసాగించబోతున్నారు.. మరి అమ్మ రాగిన్ రాజ్ తండ్రి లాగే సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

అమ్మ రాజశేఖర్ కెరియర్..

తన స్టైల్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్ తో అందరిని ఆకట్టుకున్న అమ్మ రాజశేఖర్.. కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు దర్శకుడు కూడా.. హీరో గోపీచంద్ నటించిన రణం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఈ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత రవితేజతో ఖతర్నాక్ అనే సినిమాను తెరకేక్కించారు.. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది..ఆ తర్వాత నితిన్ తో టక్కరి సినిమా చేశాడు ..కానీ ఇది ఆకట్టుకోలేదు.. అయితే ఈ సినిమాలో హీరో నితిన్ తో దర్శకుడు అమ్మ రాజశేఖర్ అదిరిపోయే స్టెప్స్ వేయించి మెప్పించాడు. ఆ తర్వాత తీసిన రణం 2 కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.. కెరియర్ లో కొంత గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొన్న ఈయన తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. మరి ఈయన లాగే ఈయన కొడుకు ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు