Manchu Lakshmi: కన్నప్ప మూవీ లో మంచు లక్ష్మి.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన నటి..!

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ మొదట్లో యాంకర్ గా.. యాక్టర్ గా రాణించింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఇంగ్లీషులో పలు సినిమాలను చేసింది.

ఇక అక్కడ రూపొందుకుంటున్న సమయంలోనే ఆ ఇండస్ట్రీకి బాయ్ చెప్పి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ప్రజెంట్ ఓ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక తాజాగా మంచు లక్ష్మి ప్రమోషన్స్ లో పాల్గొండగా.. అక్కడ ఈమెకి ఓ ప్రశ్న ఎదురయింది.

Manchu Lakshmi in Kannappa movie.. actress who gave full clarity
Manchu Lakshmi in Kannappa movie.. actress who gave full clarity

మీ బ్రదర్ విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో బాలీవుడ్ నుంచి పలు స్టార్స్ నటిస్తున్నారు కదా? మీరు కూడా నటిస్తున్నారా అనే ప్రశ్న ఎదురవ్వగా..” నేను నిజంగా ఇది జోక్ గా చెబుతా. నేను మా ఇంట్లో వాళ్లతో అసలు నటించను. ఎందుకంటే నేను నటిస్తే వారు కనిపించరు కదా ” అంటూ సమాధానం ఇచ్చింది మంచు లక్ష్మి. ప్రజెంట్ మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు