Jayasudha: శ్రీదేవీ – జయప్రద మధ్య విభేదాలు.. నిజమే అంటున్న స్టార్ హీరోయిన్..!

80 ల్లో తమ అందంతో.. నటనతో.. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా పోటీపడిన శ్రీదేవి, జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం విషయంలో వీరిద్దరూ ఎంత అయితే పోటీపడేవారో సినిమాలలో అవకాశాలు అందుకోవడంలో కూడా అంతే పోటీపడేవారు. ఎంతోమంది స్టార్ హీరోలతో విడివిడిగా నటించిన వీరిద్దరూ ఒకే సినిమాలో కలసి నటించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఎన్నో సినిమాలలో కలిసి నటించి ప్రేక్షకులకు కన్నుల పండుగగా కనిపించిన వీరిద్దరి మధ్య ఎవరికీ తెలియని విభేదాలు ఉన్నాయన్న వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అన్న విషయం పై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ జయసుధ. అటు సినిమాలు ఇటు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్న సహజ నటి జయసుధ రీసెంట్ గా ఒక మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడుతూ.. అప్పట్లో సీనియర్ హీరోలతో నటించడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది..

తర్వాత అలవాటైపోయింది. చంద్రమోహన్, శోభన్ బాబు నాకు మంచి స్నేహితులు.. ఇక చాలామంది నటులు తమ వ్యక్తిగత సమస్యలను శోభన్ బాబుతో ఎక్కువగా చూపుకునేవారు. ఆయన కూడా ఓపిగ్గా విని సలహాలు ఇచ్చేవారు అంటూ జయసుధ తెలిపారు.

- Advertisement -

ఇక తెలుగులో జయప్రద , రాధిక , నేను మంచి స్నేహితులము.. రాధిక చాలా క్లోజ్ ఫ్రెండ్.. వారి ఇంట్లో దాదాపు మూడేళ్ల పాటు ఉన్నాను అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే శ్రీదేవి , జయప్రద మధ్య కాంట్రవర్సీ గురించి ఆమె మాట్లాడుతూ.. జయప్రద, శ్రీదేవి హిందీ ఫీల్డ్ కు వెళ్లిన తర్వాత వారి మధ్య ఏం జరిగిందో నాకు ఐడియా లేదు..

అయితే సినిమా సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు అందరూ అంటుంటారు.. జయప్రదతో నాకు మంచి స్నేహం ఉంది కానీ పర్సనల్ విషయాలు మాట్లాడుకునే అంత స్నేహం లేదు అంటూ జయసుధ తెలిపారు. మొత్తానికి అయితే జయప్రద, శ్రీదేవి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు జయసుధ.

ఇక జయసుధ విషయానికి వస్తే.. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి , మళ్లీ పెళ్లి, వారసుడు వంటి సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు రాజకీయాలలో మళ్ళీ బిజీ అయిపోయారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు