Roja: సినీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న మరో వారసురాలు.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఏ ఒక్క హీరో, హీరోయిన్ అయినా సక్సెస్ అయితే.. తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు, హీరోయిన్ లు తమ వారుసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికంటూ ఒక స్థానాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మరొక వారసురాలు కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ సీనియర్ హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని మరింత ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్న ఆర్కే రోజా.. తాజాగా తన కూతురు అన్షు మాలికను సినీ ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఒక రచయితగా కూడా అతి చిన్న వయసులోనే ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక ఒక మరొకవైపు చదువుకుంటూనే ఇంకొక వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది అన్షు మాలిక. ఇక సోషల్ మీడియా ద్వారా తనకు చేతనైన సహాయం చేస్తూ తన తల్లి లాగే తన మంచి మనసును చాటుకున్న అన్షు త్వరలోనే సినీ ఇండస్ట్రీకి రాబోతుందని సమాచారం. రోజా ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈమె భర్త ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి తమ కూతురిని ఇండస్ట్రీకి తీసుకురావడానికి మంచి కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు కూడా అన్షు మాలికను ఇండస్ట్రీకి పరిచయం చేస్తామంటూ మంచి కథలతో వచ్చినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కోలీవుడ్ హీరో విక్రమ్ కొడుకుతో ఈమె ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఇది కాస్త వాయిదా పడింది.

అందుకే ఈమె మరి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి.. నటన పైన పూర్తి అవగాహన, శిక్షణ పొందిన తరువాతనే ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటుందట. అందుకే ఒకవైపు చదువుకుంటూనే.. మరొకవైపు నటనలో శిక్షణ తీసుకుంటుంది అన్షు. ఈ రెండు పూర్తి అయిన వెంటనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తానని తల్లితో చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా అన్షు మాలిక హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే.. తన తల్లిలాగే సక్సెస్ అవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు