Kangana Comments On Roja: అంత మాటన్నావేంటి సిస్టర్ – రోజాకి ఇంత అవమానమా..?

Kangana Comments On Roja

తరచూ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇటీవల దక్కడ్ సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయిన కంగనా ప్రస్తుతం లారెన్స్ తో కలిసి చంద్రముఖి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రోజాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకొని రావాలని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు మీడియా ప్రస్తావించగా సంచలన కామెంట్స్ చేసింది కంగనా. మీడియా అడిగిన ప్రశ్నకి బదులుగా అసలు రోజా ఎవరంటూ తిరిగి ప్రశ్నించింది.
రోజా ఎవరో తెలిస్తేనే కదా ఆమె చేసిన కామెంట్స్ మీద స్పందిచగలను అని బదులిచ్చింది. తాను మాత్రం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే, సినిమాలు వదులుకోనని క్లారిటీ ఇచ్చింది. తనకు దేశభక్తి ఎక్కువుందని, ఇండియా పేరుని భారత్ గా మార్చటాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో రోజాపై కంగనా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఒక సెక్షెన్ ఆఫ్ ఫ్యాన్స్ కంగనా కామెంట్స్ ని సపోర్ట్ చేస్తుంటే, అధికార పార్టీ అనుచరులు మాత్రం కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాపై కంగనా చేసిన కామెంట్స్ ఏపీలో చంద్రముఖి2 సినిమా రిలీజ్ పై ప్రభావం చూపుతాయేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి, కంగనా కామెంట్స్ పై రోజా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు