Karthika: ఘనంగా హీరోయిన్ కార్తీక పెళ్లి.. అతిథులు వీరే..!

అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన కార్తీక గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. అలనాటి అందాల తార రాధా కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక తన తల్లి లాగా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక పోయింది. బ్రదర్ అఫ్ బొమ్మాలి, రంగం వంటి పలు చిత్రాలలో నటించిన కార్తీక..ఆ తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు పొందలేక కోలీవుడ్ కే పరిమితమైంది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు లభించకపోవడంతో దుబాయిలో తన ఫ్యామిలీ నడుపుతున్న హోటల్స్ బాధ్యతలను చేపట్టి బిజినెస్ ఉమెన్ గా అవతారం ఎత్తింది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె తన పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వాటిపై స్పందించలేదు. కానీ మొన్నటికీ మొన్న తాను వివాహం చేసుకోబోతున్న వ్యక్తిని అభిమానులకు పరిచయం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్న ఉంగరాన్ని కూడా చూపించి అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఉన్నట్టుండి వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించిన కార్తీక నిన్న ఘనంగా వివాహం చేసుకుంది. కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ అయిన రోహిత్ మీనన్ తో ఏడడుగులు వేసింది.

- Advertisement -

తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం ఆదివారం (నవంబర్ 19 ) ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాగా ఇవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తోపాటు సుహాసిని, రాధిక తదితరులు ఈ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే ఈ వివాహ వేడుకలో చిరంజీవి ఆయన భార్య సురేఖ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అని చెప్పవచ్చు.

గతంలో హీరోయిన్ రాధా చిరంజీవితో చాలా చిత్రాలలో నటించగా..అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే చిరంజీవి తన భార్యతో కలిసి కార్తీక వివాహానికి హాజరైనట్లు సమాచారం.

ఇక రాధా విషయానికి వస్తే.. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలతో కలసి పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై ప్రసారం అవుతున్న కొన్ని సింగింగ్ కాంపిటీషన్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మరొకసారి తన పూర్వ వైభవాన్ని పొందే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనా ఒకప్పుడు సినిమాల ద్వారా అలరించిన రాధా ఇప్పుడు బుల్లితెర షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అవడం నిజంగా వారి అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు