Shivaji: ఆయన వల్లే శివాజీ కెరియర్ మొదలైందా..అందుకే ..?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే నటీనటులు మొదట ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది సక్సెస్ కాలేక ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. ఇకపోతే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ హీరోగా అవతారమెత్తిన అతి కొద్దిమంది హీరోలలో నటుడు శివాజీ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోగా పలు సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. శివాజీ నటుడుగా సక్సెస్ అవ్వడమే కాదు మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆదరాభిమానాలను దక్కించుకున్నారు.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని టైటిల్ విన్నర్ దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు శివాజీ. ఇకపోతే ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున హౌస్ లో అప్పుడప్పుడు శివాజీ తప్పులు చేస్తున్నా కూడా శివాజీకి సపోర్టుగా నిలుస్తున్నారు. అయితే దీనికి గల కారణం మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఇంకా అసలు విషయంలోకి వెళితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం శివాజీ వెతుకుతున్న ప్రయత్నంలో నాగార్జున పరిచయమై తన సినిమాల ద్వారా శివాజీకి అవకాశాలు కల్పించారట.

అంతేకాదు శివాజీ నేడు సినీ కెరియర్ పరంగా ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణం నాగార్జున అని సమాచారం. నాగార్జున నటించిన సీతారామరాజు సినిమా ద్వారా కీలకమైన పాత్రను శివాజీకి ఇచ్చి అలా ఆయన కెరియర్ కు దోహదపడ్డారు. ఇకపోతే శివాజీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి , నాగార్జునతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారట. ఈ కారణంగానే వాళ్ళిద్దరూ తమ సినిమాలలో అవకాశాలు కల్పించడమే కాదు.. మరికొన్ని సినిమాలలో శివాజీని రెఫర్ చేసే వారని సమాచారం. ఇక అలా వీరి వల్లే శివాజీ ఇండస్ట్రీలో మంచి సినిమాలలో అవకాశాన్ని పొందినట్లు తెలుస్తోంది..

- Advertisement -

ఇక ఆ అభిమానంతోనే నేడు బిగ్ బాస్ లో శివాజీకి నాగార్జున సపోర్టుగా నిలుస్తున్నారని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టైటిల్ విన్నర్ వైపుగా అడుగులు వేస్తున్న శివాజీ కచ్చితంగా షో ముగిసిన తర్వాత ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తారని..మళ్ళీ సక్సెస్ అందుకుంటారని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు శివాజీ రీ ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు