Shivaji : సినిమాల్లో ఉంటే కోట్లు ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు శివాజి. దీని తర్వాత హీరోగా కూడా మారి పలు హిట్ సినిమాల్లో నటించాడు. అదే క్రమంలో కొంతమంది యంగ్ హీరోలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. నితిన్ నటించిన ‘జయం’, ‘దిల్’, ‘సంబరం’, ఆర్యన్ రాజేష్ నటించిన ‘సొంతం’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో శివాజీ డబ్బింగ్ చెప్పాడు. యంగ్ హీరోల జోరు పెరిగింది. దీంతో శివాజీ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. కొన్నాళ్ళకు అది కూడా మానేసి రాజకీయ నాయకుల పై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఆపరేషన్ గరుడ అంటూ ఏవేవో కామెంట్లు చేసి కొద్ది రోజులు మీడియాలో కనిపించాడు. గత కొద్ది రోజుల నుండి మాత్రం శివాజీ ఇటు సినిమాల్లో, అటు మీడియాలో కనిపించకుండా పోయారు.

అయితే, అనూహ్యంగా శ్రీవిష్ణు నటించిన ‘అల్లూరి’ టీజర్ లాంచ్ లో ప్రత్యక్ష మయ్యాడు. ఈ చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది శివాజీనే. ఇదే విషయాన్ని శివాజీ ప్రస్తావించి, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే తాను పాలెం బస్సు సంఘటన వల్ల ఇండస్ట్రీకి దూరమైనట్టు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తాను సినిమాలో ఉంటే, 15 సినిమాల్లో నటించి కోట్లు సంపాదించుకునే వాడిని అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పోటీ వల్ల శివాజీకి అవకాశాలు రావడం దాదాపు కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు