Kajal Aggarwal: ఒక్క గంటకి అన్ని లక్షలా..? ఆ విషయంలో కాజల్ కంటే శ్రీలీలనే బెటర్..!

టాలీవుడ్ చందమామగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ తెరపై మెరిసిన కాజల్.. వరుస సినిమాలలో నటిస్తూ దక్షిణాదిన దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది కాజల్. 2020 అక్టోబర్ 30న ముంబైలోని వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది కాజల్. ఆ తర్వాత వీరికి మగ బిడ్డ కూడా జన్మించారు. ప్రస్తుతం సత్యభామ, కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో ఇండియన్ 2 అనే ప్రాజెక్టులలో బిజీగా ఉంది.

అయితే ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ కి శుభం కార్డు పడేది. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి అయిన తర్వాత కూడా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే వరుస అవకాశాలు మాత్రమే కాకుండా గతంలో కంటే ఎక్కువ పారితోషికమే తీసుకుంటుందట. ఇటీవల భగవంత్ కేసరితో ఓ హిట్టు అందుకున్న కాజల్ ని ఓ ప్రముఖ సంస్థ కరపత్రం లాంచ్ ఈవెంట్ కోసం సంప్రదించగా ఆమె ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేసిందట.

నిజానికి ఇది చాలా ఎక్కువ. కాజల్ కి ఇంతగా ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే కాజల్ డిమాండ్ చేసిన అమౌంట్ దెబ్బకి భయపడిపోయి ఆమె ప్లేస్ లో శ్రీలీలను తీసుకువచ్చారట మేకర్స్. అయితే శ్రీలీల మాత్రం కేవలం 12 లక్షలే ఛార్జ్ చేసిందట. అంతేకాకుండా ట్రావెలింగ్ ఖర్చులు కూడా తీసుకోలేదట. అయితే కాజల్ కి మాత్రం ఫ్లైట్ ఖర్చులతో పాటు రూమ్ స్టెయింగ్ ఖర్చులు కూడా ఇవ్వాల్సి వచ్చేదని.. ఇలా కాజల్ రెమ్యూనరేషన్ ని భరించలేక సదరు సంస్థ శ్రీలీలను ఫైనలైజ్ చేసుకుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు