Prabhudeva-Kajol : 27ఏళ్ళ తర్వాత మళ్ళీ జతకట్టనున్న రొమాంటిక్ జోడీ!

Prabhudeva-Kajol : ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు పేరు పొందిన ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రభుదేవా ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ గా పేరుతెచ్చుకోగా, పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసాడు. అలాగే ప్రేమికుడు సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చి, ఎప్పటికప్పుడు పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ, ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్స్ ఒకప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ గత 20 ఏళ్ళ నుంచి ఆ తరహా కాంబినేషన్స్ కనిపించడం లేదు. ఇక కొన్నిసార్లు ఓకే సినిమాతో మెప్పించిన హీరో, హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడాలని ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకునే లిస్టులో “మెరుపు కలలు” జోడి కూడా ముందువరుసలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు గా ప్రభుదేవా, కాజోల్ నటించగా, మరో హీరోగా అరవింద్ స్వామి కూడా నటించాడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఇక ఇప్పడు మళ్ళీ ఈ కాంబోలో సినిమా రానుందని వార్తలు వస్తున్నాయి.

Prabhudeva-Kajol combo movie again after 27 years

27 ఏళ్ళ తర్వాత మెరుపుకలల జోడి..

ఇక మెరుపు కళలు సినిమాలో ప్రభుదేవా – కాజోల్ జంటగా నటించగా, ఈ సినిమాలో ‘వెన్నెలవే..వెన్నెలవే’ పాటను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి ఈ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ళకు బిగ్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించబోతోంది. టాలీవుడ్‌ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌లో దర్శకుడిగా తన ప్రతిభను చాటేందుకు సిద్దమయ్యాడు. తన కొత్త యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్‌ స్టార్‌ కాజోల్, అలాగే ప్రభుదేవా (Prabhudeva-Kajol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 27 సంవత్సరాల క్రితం మెరుపు కలలు సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఇక ఈ ప్రాజెక్టులో నజిరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. కాజోల్, ప్రభుదేవా కాంబినేషన్ ప్రేక్షకులకు ఇప్పుడు మరింత ఉత్సాహం కలిగించనుందని చెప్పొచ్చు. ఇక ఈ ప్రాజెక్టు తొలి షెడ్యూల్ పూర్తయి, త్వరలోనే టీజర్ కూడా విడుదల చేయనున్నారు.

- Advertisement -

భారీ టెక్నిషియన్స్ తో సినిమా..

ఇక ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన జికె విష్ణు, యానిమల్ మూవీకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఎడిటర్ నవీన్ నూలి వంటి ప్రతిభావంతులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇక ప్రభుదేవా, కాజోల్ కలయికతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేనివిధంగా వినోదాన్ని అందించనుంది. పాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి, చరణ్ తేజ్ ఉప్పలపాటి బీటౌన్‌లో తన ప్రతిభను నిరూపించడానికి భారీ ప్రాజెక్టుతో ముందుకు రావడం నిజంగా ప్రత్యేకంగా ఉంది. ఇక ప్రభుదేవా, కాజోల్ తమ తమ సినిమాల్లో బిజీగా ఉండి, ఇతర సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభుదేవా రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ ఛేంజర్” సినిమాకి కొరియోగ్రఫీ కూడా అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు