Venu Swami: ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పవన్ పరిస్థితి ఇదే.. వేణు స్వామి సంచలన స్టేట్మెంట్

Venu Swami: ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఒకప్పుడు నటుడిగా కూడా నటించారు. ఇప్పుడు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి.. వారి వ్యక్తిగత జీవిత విషయాల గురించి జాతకాలు చెబుతూ వారిని వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఈయన చెప్పే విషయాలు నిజం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు పలువురు స్టార్ హీరోలపై , హీరోయిన్లపై కామెంట్లు చేసే ఈయన తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లు సర్వత్రా వైరల్ గా మారుతున్నాయి.

పిఠాపురం నుంచి పవన్ పోటీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2014లో పోటీ చేసినా గెలవలేదు.. 2019 ఎన్నికలలో కూడా పోటీ చేశారు.. అక్కడా నిరాశే ఎదురయింది.. ఇప్పుడు టిడిపి , బిజెపి లతో పొత్తు పెట్టుకున్న ఈయన ఈసారి ఎలాగైనా సరే గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్.. జూన్ 4వ తేదీన ఎన్నికలు వెలువడున్న నేపథ్యంలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై సంచలన కామెంట్లు చేశారు వేణు స్వామి..

పవన్ అధికారంలోకి రావడం కష్టమే – వేణు స్వామి

Venu Swami: This is Pawan's situation after the election result.. Venu Swami's sensational statement
Venu Swami: This is Pawan’s situation after the election result.. Venu Swami’s sensational statement

ఏపీ ఎన్నికలలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హవా కనిపించింది..ఈ పరిస్థితుల్లో వేణు స్వామి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జోష్యం చెప్పారు.. ముఖ్యంగా చంద్రబాబు కు కొన్ని గ్రహాల అనుకూలత లేదు.. కాబట్టి ఆయనకు రాజయోగం లేదని.. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగలేరని.. ఎన్నికల రిజల్ట్ తర్వాత ఒక పార్టీ ఏపీలో ఉండదు అంటూ వేణు స్వామి జాతకాన్ని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మరోలా కనిపిస్తున్నాయి.. ఇకపోతే ఎన్నికల వేళ ఇలా వేణు స్వామి రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జాతకాలు చెప్పడం ఇప్పుడు జనాలలో మరింత చర్చలకు తావిస్తోంది. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదే అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

వైయస్సార్ పార్టీని గద్దె దించడమే ధ్యేయం..

మరోవైపు వైయస్సార్ పార్టీని గద్దె దించాలని టార్గెట్ పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగారు పవన్ కళ్యాణ్.. ఈ మేరకు బిజెపి , టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా కూడా పోటీ చేశారు.. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు వేణు స్వామి ఇలాంటి కామెంట్లు చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది.. మరి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక రచనలు ఏ మేరకు నెరవేరుతాయో తెలియాలి అంటే జూన్ 4 న వెలువడే ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన జూన్ 4 తర్వాత వచ్చే ఫలితాలను బట్టి సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నారు.. ఇప్పటికే ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ .. జూన్ 4 తర్వాత సినిమా షూటింగ్లలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈయనకు ఏ అంశం కలిసి వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు