Yevam : చాందిని చౌదరి పై ట్రోల్స్.. దీనికి సెట్ కాదట.?

Yevam : తెలుగమ్మాయి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కలర్ ఫోటో మూవీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఆ తర్వాత వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త చిత్రం “యేవమ్”. వశిష్ఠ సింహ, ఆషు రెడ్డి, భరత్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్, సిస్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఒకరి మీద శృతిమించిన వ్యామోహం ఎన్ని ఘోరాలైన చేయిస్తుంది అనే ఎలిమెంట్ తీసుకొని యేవమ్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అయితే యేవమ్ చిత్రంలో చాందిని చౌదరి తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది.

Netizens trolling Chandni Chaudhary

డిఫరెంట్ గా ‘యేవం’ టీజర్..

ఇక యేవం టీజర్ లో పోలీస్ జాబ్ సంపాదించి కొత్తగా ఏఎస్సైగా డ్యూటీలో జాయిన్ అయిన చాందిని చౌదరి స్థానికంగా జరిగే హత్యల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. గంగాధర్ అనే పేరుతో ఆమెకి ఫోన్ వచ్చి ఆ హత్యలన్నీ చేసింది నేనే అని ఓ అజ్ఞాత వ్యక్తి చెబుతాడు. అతన్ని పట్టుకోవడానికి చాందిని చౌదరి వెళ్తుంది. ఆమెని కనిపించకుండా మోహించే వ్యక్తిగా వశిష్ట సింహ కనిపిస్తున్నాడు. ఇక టీజర్ ఆరంభంలోనే అషురెడ్డి క్యారెక్టర్ ని పరిచయం చేసి ఆమెని కూడా కిరాతకంగా చంపినట్లు చూపించారు. ఓవరాల్ గా టీజర్ చూస్తుంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దారుణంగా హత్యలు చేసే ప్రతినాయకుడిగా వశిష్ట సింహ కనిపిస్తున్నాడు. అతని నుంచి చాందిని తనని తాను కాపాడుకొని, హత్యలని ఎలా నిలువరించింది అనేది ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

యేవమ్ కి మిక్సడ్ రెస్పాన్స్.. కారణం అదే..

అయితే యేవం (Yevam) టీజర్ చూడ్డానికి బాగానే ఉన్నా, సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దానికి చాందిని చౌదరి మెయిన్ రీసన్ అయింది. ఈ సినిమాలో చాందిని చౌదరి ఎస్సై గా నటిస్తుంది. అయితే చాందిని చౌదరి టీజర్ లో చూడ్డానికి బాగానే ఉన్నా, పోలీస్ ఆఫీసర్ రోల్ కి ఈమె సెట్ అవదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఏమి చాందినిలో కనబడట్లేదని, ముఖ్యంగా సరైన ఫిజిక్ కూడా చాందినికి లేదని అంటున్నారు నెటిజన్లు. అయితే ఈ ట్రోల్స్ అన్నిటిని చాందిని సినిమాతో సమాధానం చెప్తుందేమో చూడాలి.
ఇక ఈ సినిమాకు కీర్తన శేష్, నీలేష్ మందలపు మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ ఉండబోతోందని టీజర్ లో తెలిపారు. మరి చాందినికి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ బహుశా జులై లో ఉండే అవకాశం ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు