Jr NTR Political news : జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీకి సంబంధం లేదు… టీడీపీ సంచలన ప్రకటన..

Jr NTR Political news : తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మే 13న తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణాలో ఎంపీ ఎన్నికలు, అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, తో పాటు ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఇక ఎప్పుడూ లేనట్టుగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో పలువురు సినీ సెలెబ్రిటీలు రాజకీయాల్లో ప్రచారం కూడా చేసారు. కొందరు ప్రచారం చేయకపోయినా తమ వంతు మద్దతు ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలలో సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు కూడా ఎన్నికలలో అభ్యర్థులు గా పోటీ చేసిన గతి తెలిసిందే. ఇదిలా ఉండగా టాలీవుడ్ యంగ్ టైగర్ నందమూరి వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నాడు. కనీసం టిడిపి తరపున ఒక ట్వీట్ కూడా వేయలేదు. గత కొన్నాళ్లుగా రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల, తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అప్పట్లోనే పలుమార్లు ప్రకటించాడు జూనియర్ ఎన్టీఆర్. అయినా సరే టీడీపీ వ్యతిరేక సంస్థలు టీడీపీలో అంతర్గతంగా చీలికలను సృష్టించేందుకు ఎన్టీఆర్ – టీడీపీ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ వార్తలు ఉపయోగించుకుంటున్నాయి.

TDP activist Buddha Venkanna controversial comments on Jr NTR

ఎన్టీఆర్ కి పార్టీ కి సంబంధం లేదు..

ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి కార్యకర్త బుద్ధా వెంకన్న అనే వ్యక్తి వ్యాఖ్యానించాడు. అయితే ఇలాంటి ఒక ప్రయత్నం ఆ మధ్య వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని కూడా చేసాడు. టిడిపి నుండే వైసిపి కి వెళ్లిన కొడాలి నాని హరికృష్ణ కుటుంబానికి ఆప్తుడు అని తెలిసిందే. కానీ ఎన్నికల్లో ప్రచారానికి అప్పుడప్పుడూ వాడుకుంటాడని జనాలు అంటుంటారు. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫైల్ పిక్‌ ను పంచుకున్నాడు కోడలి నాని. ఇక ఈ పిక్ టైమింగ్ పోలింగ్ ముగియగానే రావడంతో ఎన్టీఆర్ జగన్ ను షేర్ చేస్తూ టీడీపీ వర్గాన్ని అస్థిరపరిచేందుకు కొడాలి నాని ప్రయత్నిస్తున్నాడనే టాక్ వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR Political news) కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ కార్యకర్త బుద్దా వెంకన్న కొత్త ట్విస్ట్‌లో వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఎన్టీఆర్ టీడీపీ వ్యతిరేకుల చర్య..

తాజాగా బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలలో “ఎన్టీఆర్ కి టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, 2014, 19, 24 ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆయన రాలేదని, అలాంటప్పుడు ఆయన పార్టీతో ఎలా సంబంధం పెట్టుకుంటారని కామెంట్స్ చేసారు. ఇక తెలుగుదేశం చంద్రబాబు నాయుడుగారి వల్లే నడుస్తోందని, అది అలాగే ఉంటుంది’’ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. అలాగే వల్లభనేని వంశి, కొడాలినాని మాట్లాడుతున్నారని ఈ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరమే లేదని అన్నారు. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టిడిపి బాధ్యతలు పూర్తిగా లోకేష్ కి అప్పగించాలని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ ఏమిటంటే, ఎన్టీఆర్ – టిడిపి మధ్య చిచ్చు అనే ట్రాక్, ఇప్పుడు వాస్తవంగా ఎపి రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి టిడిపి వ్యతిరేక వర్గాలు ఎన్టీఆర్‌ తో వేలాడే బదులు ఇతర అంశాలను అన్వేషించడం మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు