Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై.. అసలు నిజాన్ని బయటపెట్టిన డైరెక్టర్..!

Uday Kiran.. దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. మొదట తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు..అలా పరిచయమైన తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత మరోసారి తేజ దర్శకత్వంలో నువ్వు నేను అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు.. ఈ సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ఉదయ్ కిరణ్. ఇక నువ్వు నేను సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.. ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీలను చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఉదయ్ కిరణ్..

ఆఫర్స్ తగ్గడంతో ఆత్మహత్య..

Uday Kiran: The director revealed the truth about Uday Kiran's suicide..!
Uday Kiran: The director revealed the truth about Uday Kiran’s suicide..!

మనసంతా నువ్వే సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈయన.. ఈ సినిమా ఆయన సినీ కెరియర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచింది.. ఇక ఆ తర్వాత మెల్లగా ఆఫర్స్ తగ్గడం మొదలయ్యాయి.. దీంతో డిప్రెషన్ కి గురయ్యాడు ఉదయ్ కిరణ్.. ఎంతో ఎత్తుకు ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్న ఈయన ఉన్నట్టుండి అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయి డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. ఈయన మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.. ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉంటారు అభిమానులు.. అయితే ఉదయ్ కిరణ్ మరణం పై ఆసక్తికర కామెంట్లు చేశారు ప్రముఖ దర్శకుడు వీ.ఎన్ ఆదిత్య..

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై వీ.ఎన్.ఆదిత్య కామెంట్స్..

వీఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా చేసి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయ్ చాలా మంచి మనిషి.. చిన్న వయసులోనే ఎన్నో సక్సెస్ లు చూశారు.. కానీ ఆ సక్సెస్ లను ఆయన హ్యాండిల్ చేయలేకపోయారు.. వరుస హిట్స్ తర్వాత వరుసగా ప్లాప్ లు కూడా వచ్చాయి.. వాటిని తీసుకోలేకపోయాడు ఆ తర్వాత ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో తట్టుకోలేక మదనపడ్డాడు .. ఇంకా వాటన్నింటినీ భరించే శక్తి లేక ఆత్మహత్య చేసుకున్నారు.. నిజానికి ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ముందు నుంచే ఉంది.. నాకు తేజకు, ఆర్పీ పట్నాయక్ కి ముందే తెలుసు మేమంతా మాట్లాడి దాని నుంచి బయటకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాము.. కానీ అతను మా మాట వినలేదు మా మాట పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ వీ.ఎన్.ఆదిత్య తెలిపారు.

- Advertisement -

ఉదయ్ కిరణ్ సినిమాలు..

చిత్రం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి భారీ సక్సెస్ లు అందుకున్నారు.. అటు అబ్బాయిలకే కాదు ఇటు అమ్మాయిలకి కూడా ఈయన ఫేవరెట్ హీరోగా మారిపోయారు.. ఇక వరుసగా విజయాలు అందుకున్న ఈయన ఉన్నట్టుండి ఆ తర్వాత నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.. దీంతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు