Akshay Kumar : పదెకరాల్లో రెండువందల గుర్రాలతో సవారీ చేస్తున్న కిలాడీ..! దేనికో తెలుసా?

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ కిలాడీ అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ OMG2 తో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్న అక్షయ్, ఆ విజయ పరంపరని కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే “బడే మియా చోటే మియా” సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. ఇక ఈ ఏడాదే కాదు గత మూడు నాలుగేళ్లుగా చాలా సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ దాదాపు పది ప్లాప్ సినిమాలు చేసాడు. కొన్ని సినిమాలు బాగున్నా, సరైన టైం లో విడుదల కాకో, ఇంకే కారణాల చేతనో ప్లాప్ లు గా మిగిలిపోయాయి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్లున్నా..లేక‌పోయినా కిలాడీ అక్ష‌య్ కుమార్ మాత్రం త‌గ్గేదేలేదన్నట్టు సినిమాలు చేస్తున్నాడు. ఓ వైపు రొటీన్ సినిమాలు చేస్తున్నాడని విమర్శలు వస్తున్నా వాటితో సంబంధం లేకుండా వ‌రుస‌తో ప్రాజెక్ట్ లు ప‌ట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అక్షయ్ కుమార్. ఇప్ప‌టికే అక్ష‌య్ ఖాతాలో అరడజను ప్రాజెక్టులు సినిమాలున్నాయి. ఇక అందులో “వెల్ క‌మ్ టూది జంగిల్” సినిమా ఒక‌టి. ఈ సినిమా షూటింగ్ గురించి తాజా సమాచారం వచ్చింది.

Akshay Kumar 'Welcome To The Jungle' Movie Update

200 గుర్రాలతో సవారీ..

తాజాగా అక్ష‌య్ కుమార్ హీరోగా “వెల్కమ్ టు ది జంగిల్” సినిమా తెరకెక్కుతుండగా, అహ్మ‌ద్ ఖాన్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ కామెడీ యాక్షన్ బ్లాక్ బస్టర్ “వెల్ క‌మ్” ప్రాంచైజీ నుంచి వ‌స్తోన్న మూడ‌వ సినిమా కావ‌డంతో ఈ మూవీ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ర‌వీనా టాండ‌న్, దిశాప‌టానీ, జాక్వెలిన్ పెర్నాండేజ్ లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం రీసెంట్ గా ఓ భారీ యాక్ష‌న్ సీన్వెన్స్ ముంబైలో చిత్రీక‌రిస్తున్నట్లు స‌మాచారం. 10 ఎక‌రాల్లో భారీ సెట్లు నిర్మించి ఈ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారట‌. ఇక ఇందులో ఏకంగా 200 గుర్రాల్ని కూడా వినియోగిస్తున్నారుట‌. వార్ నేప‌థ్యంలో గుర్రాలు కూడా అవ‌స‌రం ప‌డ‌టంతో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ఆ స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 7 రోజుల పాటు ఈ స‌న్నివేశాలు షూట్ చేసిన‌ట్లు సమాచారం. అందుకోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు సీక్వెల్..

ఇక కిలాడీ అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) కెరీర్ లోనే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అవుతాయని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు పనిచేసిన‌ట్లు చెబుతున్నారు. వీటి చిత్రీక‌ర‌ణకు ముందు అక్ష‌య్ ఫైట్స్ సీన్స్ కి సంబంధించి విదేశాల్లో ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకున్నాడట‌. ఆయ‌న‌కు శిక్ష‌ణ ఇచ్చిన స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలోనే వీటిని చిత్రీక‌రించిన‌ట్లు వినిపిస్తుంది. ఇక ఈ సినిమాను తొందర్లోనే పూర్తి చేసి ఇదే ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికంటే ముందే అక్షయ్ కుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు