Salaar 2: ఇక సలార్ 2 ఆగిపోయినట్లేనా .? కారణాలు ఇవేనా .?

Salaar 2:ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ప్రభాస్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం వర్షం అని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినాక, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ప్రభాస్ ను స్టార్ హీరో ను చేసింది.

బాహుబలి తో పాన్ ఇండియా గుర్తింపు

ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలు ప్రభాస్ చేశాడు. అయితే ప్రభాస్ విషయానికొస్తే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. ఇకపోతే బాహుబలి సినిమా ప్రభాస్ కి ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమా ఏది రిలీజ్ అయిన కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయితే వీటన్నిటికీ సమాధానంగా సలార్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.

- Advertisement -

prabhas salaar

సలార్ 2 సినిమా

సలార్ సినిమాలోని ప్రభాస్ ని ఎలివేట్ చేసిన విధానం. ప్రభాస్ కటౌట్ ను చూపించిన విధానం అన్ని కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. సలార్ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న కథనాలు ప్రకారం సలార్ 2 సినిమా ఆగిపోయిందని సమాచారం వినిపిస్తుంది. దీనికి కారణం ప్రభాస్ కి మరియు ప్రశాంత్ నీల్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇక పోతే ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ 31వ సినిమాను చేయనున్నాడు.

ప్రభాస్ లైనప్

ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా ఫినిష్ చేసుకొని మారుతి సినిమాలో బిజీగా ఉన్నాడు. మారుతి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు ప్రభాస్. ఈ సినిమా డిసెంబర్లో స్టార్ట్ కానుంది ఈ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. అయితే సలార్ 2 ఆగిపోయినట్లు వస్తున్న వార్తలకి సమాధానం టీం నుంచి అధికారికంగా వస్తే గాని ఒక క్లారిటీ రాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు